సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శనివారం, 15 జులై 2017 (13:57 IST)

శివకార్తీకేయన్ కోసం నువ్వా నేనా అంటోన్న నయన-సమంత?

కోలీవుడ్‌లో అగ్రహీరోయిన్లు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారు. యాంకరింగ్ నుంచి హీరోగా ఎదిగిన శివకార్తీకేయన్ (రెమో ఫేమ్)కు జోడీగా నయనతార నటిస్తోంది. వేలైక్కారన్ అనే పేరిట ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంల

కోలీవుడ్‌లో అగ్రహీరోయిన్లు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారు. యాంకరింగ్ నుంచి హీరోగా ఎదిగిన శివకార్తీకేయన్ (రెమో ఫేమ్)కు జోడీగా నయనతార నటిస్తోంది. వేలైక్కారన్ అనే పేరిట ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో శివతో కలిసి నయన వున్న ఫోటోలు ఇప్పటికీ రిలీజైనాయి. మరోవైపు చెన్నై బ్యూటీ సమంత ఇటీవల లంగా ఓణీలో దర్శనమిచ్చింది. ఈ స్టిల్ శివ, నయన నటించే వేలైక్కారన్ కోసమేనని కోలీవుడ్‌లో జోరుగా చర్చ సాగుతోంది. 
 
శివకార్తికేయన్ కథానాయకుడిగా దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా నయనతార నటిస్తోంది. ఇక సమంత ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తుందని సమాచారం. హీరో కోసం వీరిద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోటీపడి నటిస్తారని తెలిసింది.
 
సమంతకు సంబంధించిన కొంతభాగం షూటింగును ఇటీవల చిత్రీకరించారని సమాచారం. చాలా సాదాసీదా యువతిగా సమంత ఈ చిత్రంలో కనిపించనుంది. నయనతార, సమంతా పోటీపడి నటించే ఈ సినిమాలో, ప్రకాశ్ రాజ్ - స్నేహా కీలక పాత్రల్లో కనిపిస్తారట.