గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : ఆదివారం, 30 జులై 2017 (13:15 IST)

రాజమౌళి కుమారుడు పచ్చిమోసకారి.. ఎవరంటున్నారు?

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కుమారుడు కార్తికేయపై ఓ సంస్థ యజమాని సంచలన ఆరోపణలు చేశారు. కార్తికేయ పచ్చిమోసకారి అన్నారు. ఇలా ఆరోపణలు చేస్తున్న యజమాని ఎవరో కాదు.. ఓ డ్రోన్ల కంపెనీ యజమాని. ఈ తరహా ఆరోపణలు

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కుమారుడు కార్తికేయపై ఓ సంస్థ యజమాని సంచలన ఆరోపణలు చేశారు. కార్తికేయ పచ్చిమోసకారి అన్నారు. ఇలా ఆరోపణలు చేస్తున్న యజమాని ఎవరో కాదు.. ఓ డ్రోన్ల కంపెనీ యజమాని. ఈ తరహా ఆరోపణలు చేసిన ఆయన... తన పేరును మాత్రం వెల్లడించేందుకు సదరు సంస్థ నిర్వాహకుడు అంగీకరించలేదు. 
 
సినిమాకు డ్రోన్ ఆపరేటర్లు కావాలంటూ వారాహి చలన చిత్రం నుంచి ఫోన్ వచ్చిందని, అయితే, వాళ్ల అవసరాలకు అనుగుణంగా డ్రోన్లను తయారు చేయడానికి కాస్త సమయం పడుతుందని ముందే వాళ్లకు వివరించానని చెప్పారు. అందుకు అనుగుణంగానే దానిపైనా వారు ఖర్చు చేశారని చెప్పారు. డ్రోన్లను తయారుచేసి, పరీక్షించడానికి టైం పడుతుందని ఈమెయిల్ ద్వారా కూడా వారికి స్పష్టంగా చెప్పానన్నారు. 
 
అసలు ‘‘డ్రోన్ల అభివృద్ధిలో ఆలస్యానికి చాలా కారణాలున్నాయి. ఉన్నఫళంగా డ్రోన్ల విడిభాగాలు మార్కెట్లో లభించాలంటే దొరకవు. డ్రోన్లు వాటర్ ప్రూఫ్ కాదు కాబట్టి, వర్షంలో వాటిని టెస్ట్ చేయలేం. అంతేకాదు, ఫైనల్ షూట్‌కు ముందు షూటింగ్ లొకేషన్‌ను కూడా మేం చూసుకోవాలి. ఎందుకంటే, అక్కడ విద్యుదయస్కాంత క్షేత్రాలు అక్కడ ప్రభావం చూపిస్తున్నాయా..? విద్యుత్ లైన్లు ఉన్నాయా..? గాలి ప్రభావం వంటి ప్రభావాలను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. 
 
కానీ, పదో రోజు మాత్రం షూటింగ్‌కు ప్యాకప్‌ చెప్పే అరగంట ముందు మాతో పనిలేదని తేల్చి చెప్పారు. అంతేకాదు, అన్ని రోజులు మేం తయారుచేసిన డ్రోన్లను వాళ్ల దగ్గరే పెట్టుకున్నారు. మా పనికి సగం డబ్బులు మాత్రమే చెల్లించారు. ఇంకా రూ.2 లక్షల బాకీని వారు చెల్లించాల్సి ఉంది. డబ్బులు చెల్లించకపోగా మా డ్రోన్లను వాళ్ల దగ్గర ఎలా పెట్టుకుంటారు?’’ అని సదరు డ్రోన్ల సంస్థ యజమాని ప్రశ్నించారు.
 
కాగా, ఈ వ్యవహారమంతా నడిచింది నాగార్జున తనయుడు నాగచైతన్య హీరోగా వస్తున్న యుద్ధం శరణం సినిమాపైనా. ఆ సినిమాను నిర్మిస్తోంది ‘వారాహి చలన చిత్రం’. అంతేకాదు, కార్తికేయ కూడా ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఆరోపణలు ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో ఇపుడు చర్చనీయాంశంగా మారాయి.