లైవ్ షోలో స్టేజ్‌పై ఆడిపాడిన ఐష్.. దద్దరిల్లిన ఆడిటోరియం (Video)

బాలీవుడ్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ స్టేజ్‌పై అదరగొట్టింది. ఆడుతూ పాడుతూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. దీంతో అభిమానులు సందడి అంతా ఇంతాకాదు. కేకలు, ఈలలతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. అయ

aish in fanney khan
pnr| Last Updated: బుధవారం, 11 జులై 2018 (18:59 IST)
బాలీవుడ్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ స్టేజ్‌పై అదరగొట్టింది. ఆడుతూ పాడుతూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. దీంతో అభిమానులు సందడి అంతా ఇంతాకాదు. కేకలు, ఈలలతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. అయితే ఇది రియల్ లైఫ్‌లో కాదులేండి. రీల్ లైఫ్‌లోనే  సుమా.
 
అతుల్ మంజ్రేకర్ తెరకెక్కిస్తున్న "ఫన్నేఖాన్" చిత్రంలో ఐష్ ఓ ముఖ్యపాత్రను పోషిస్తోంది. ఇందులో పాప్ సింగర్‌గా కనిపిస్తోంది. లైవ్ షో ఈవెంట్‌లో భాగంగా ఆడియన్స్ ముందు స్టేజ్‌పై ఆడి పాడిన ఐష్‌ని చూసి అభిమానులు గంతులు వేశారు. 'మోహబ్బత్' అనే ఈ పాటకి ఐష్ స్టెప్స్ వేయగా, ఈ పాటకి ఫ్రాంక్ గాట్సన్ కొరియోగ్రఫీ అందించారు. చిత్రంలో ఐష్ పాత్రని బట్టే ఈ సాంగ్ డిజైన్ చేసామని దర్శకుడు చెబుతున్నాడు. 
 
ఇకపోతే, 'ఫన్నేఖాన్' చిత్రంలో అనీల్ కపూర్, రాజ్ కుమార్ రావు కూడా ప్రధాన పాత్రలు పోషించారు. మంచి గాయకుడు కావాలనే కోరిక తీర్చుకోలేని తండ్రి పాత్రలో అనీల్ కపూర్ నటించారు. వచ్చే నెల మూడో తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి. 
 దీనిపై మరింత చదవండి :