ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 11 జులై 2018 (15:28 IST)

రాహుల్‌ను కలిసిన 'కాలా' దర్శకుడు... ఎందుకు?

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన "కాలా" చిత్రానికి దర్శకత్వం వహించిన పా.రంజిత్ భేటీ అయ్యారు. న్యూఢిల్లీలో రాహుల్ నివాసంలో వీరిద్దరి కలయిక జరిగింది. ఈ విషయాన్ని రాహుల

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన "కాలా" చిత్రానికి దర్శకత్వం వహించిన పా.రంజిత్ భేటీ అయ్యారు. న్యూఢిల్లీలో రాహుల్ నివాసంలో వీరిద్దరి కలయిక జరిగింది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ స్వయంగా తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు.
 
పా.రంజిత్‌తో జరిగిన సమావేశంలో రాజకీయం, సినిమాలు, సమాజంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్టు తెలిపారు. 'మద్రాస్, కబాలి, కాలా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు పా.రంజిత్, నటుడు కలైయారసన్‌ను మంగళవారం కలిశాను. ప్రస్తుత రాజకీయాలు, సినిమాలు, సమాజం అంశాలపై చర్చించాం. వారిద్దరితో చర్చించడం చాలా సంతోషంగా ఉందని' అని రాహుల్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా వారిద్దరితో కలిసి దిగిన ఫొటోను రాహుల్ షేర్ చేశారు.