గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: బుధవారం, 11 జులై 2018 (13:00 IST)

ఎట్ట‌కేల‌కు ర‌జ‌నీ 2.0 రిలీజ్ డేట్ ఫిక్స్..!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో రోబో సీక్వెల్ 2.0 రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. గ్రాపిక్స్ కంప్లీట్ కాలేదు అంటూ ఇన్నాళ్లు వాయిదా పడుతూ వ‌చ్చింది. ఆడ‌యో ఫంక్ష‌న్ కూడా గ్రాండ్‌గా

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో రోబో సీక్వెల్ 2.0 రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. గ్రాపిక్స్ కంప్లీట్ కాలేదు అంటూ ఇన్నాళ్లు వాయిదా పడుతూ వ‌చ్చింది. ఆడ‌యో ఫంక్ష‌న్ కూడా గ్రాండ్‌గా చేసిన త‌ర్వాత సినిమా ఇంత కాలం వాయిదా ప‌డ‌డంతో అస‌లు ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? అనే అనుమానాలు మొద‌ల‌య్యాయి. ర‌జ‌నీకాంత్ కూడా 2.0 ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి.
 
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... డైరెక్ట‌ర్ శంక‌ర్ 2.0 మూవీని న‌వంబ‌ర్ 29న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ట్విట్ట‌ర్ ద్వారా ఎనౌన్స్ చేసారు. ఈ చిత్రంలో ర‌జ‌నీ స‌ర‌స‌న అమీ జాక్స‌న్ న‌టిస్తే.. బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ విల‌న్‌గా న‌టించ‌డం విశేషం. లైకా ప్రొడ‌క్ష‌న్ దాదాపు 500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాని నిర్మించింది. 
 
రోబో ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో అంద‌రికీ తెలిసిందే. దీంతో రోబో సీక్వెల్ అంటే అంచ‌నాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ఊహించుకోవ‌చ్చు. మ‌రి... అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు 2.0 సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంద‌ని ఆశిద్దాం.