బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Srinivas
Last Modified: శుక్రవారం, 15 జూన్ 2018 (15:12 IST)

ర‌జ‌నీకాంత్ 2.0 రిలీజ్ చేసేందుకు శంకర్ భయపడుతున్నారా?

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కాలా రిలీజైంది. ఇక 2.0 రిలీజ్ కావాలి. గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న సంచ‌ల‌న చిత్రం 2.0 ఎప్పుడో రిలీజ్ కావాలి. కానీ..గ్రాఫిక్స్ వ‌ర్క్ కంప్లీట్ కాక‌పోవ‌డం వ‌ల‌న వాయిదా ప‌డుతూనే ఉంది. ఈ సంవ‌త్స‌రం ఏప్రిల్

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కాలా రిలీజైంది. ఇక 2.0 రిలీజ్ కావాలి. గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న సంచ‌ల‌న చిత్రం 2.0 ఎప్పుడో రిలీజ్ కావాలి. కానీ..గ్రాఫిక్స్ వ‌ర్క్ కంప్లీట్ కాక‌పోవ‌డం వ‌ల‌న వాయిదా ప‌డుతూనే ఉంది. ఈ సంవ‌త్స‌రం ఏప్రిల్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రావాలి... రాలేదు. ఆ త‌ర్వాత ఆగ‌ష్టులో రిలీజ్ అనుకున్నారు కానీ.. అదీ జ‌ర‌గ‌డం లేదు. 2.0 రిలీజ్ వాయిదా ప‌డుతుండ‌టంతో కాలా సినిమాని రిలీజ్ చేసారు. 
 
ఈ ఏడాది చివ‌ర‌లో రిలీజ్ చేద్దాం అనుకుంటే... ఈ ఏడాది దీపావళికి అమీర్ ఖాన్ మూవీ 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' క్రిస్మస్‌కి షారుఖ్ జీరో రిలీజ్ కానున్నాయి. అందువలన 2.0 సినిమాను వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారని స‌మాచారం. 2.0 సినిమా కోసం ఎదురుచూస్తుండగానే కాలా రిలీజ్ అయ్యింది. 
 
ఇక 2.0 సినిమా రిలీజఅయ్యే లోపు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ చేస్తోన్న సినిమా కూడా థియేటర్లకు వచ్చేస్తుందేమో అంటున్నారు. మరోవైపు రజినీకాంత్ 2.0 విడుదల చేసేందుకు దర్శకుడు శంకర్ ఏమైనా భయపడుతున్నారేమోనన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. కాలా మిశ్రమ స్పందనతో ఆడుతోంది.