మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 జూన్ 2018 (15:04 IST)

టాలీవుడ్‌లో మెగా హీరోల బాక్సాఫీస్ వార్.. వెనక్కితగ్గేది లేదంటున్న డెబ్యూ హీరో

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ హీరోల మధ్యే బాక్సాఫీస్‌వార్ మొదలైంది. ముఖ్యంగా, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్‌లు నువ్వానేనా అన్నట్టుగా పోటీపడుతున్నారు.

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ హీరోల మధ్యే బాక్సాఫీస్‌వార్ మొదలైంది. ముఖ్యంగా, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్‌లు నువ్వానేనా అన్నట్టుగా పోటీపడుతున్నారు.
 
నిజానికి తెలుగు సినిమా హీరోలు థియేట‌ర్ల‌లోనికి సింగిల్‌గా వచ్చేందుకే ఇష్టపడతారు. మరో హీరోతో పోటీప‌డి తమ చిత్రాన్ని కూడా అదే రోజు విడుదల చేయడానికి ఏమాత్రం ఇష్టపడరు. కానీ, ఇక్కడ మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వేదిక‌గా పోటీప‌డబోతున్నారు.
 
సాయిధ‌ర‌మ్ తేజ్‌, అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించిన చిత్రం 'తేజ్ ఐ ల‌వ్యూ'. ఈ చిత్రానికి క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వహించగా, వచ్చే నెల ఆరో తేదీన ప్రేక్ష‌కుల ముందుకురానుంది. ఈ మేరకు అధికారికంగా కూడా విడుదల తేదీని ప్రకటించారు. 
 
ఇక చిరంజీవి చిన్నకుమార్తె శ్రీజ భర్త క‌ల్యాణ్‌దేవ్ న‌టించిన తొలి సినిమా 'విజేత'. ఈ సినిమా కూడా జూలై ఆరో తేదీనే విడుద‌ల కాబోతోంది. దీనికి కార‌ణం నిర్మాత సాయి కొర్ర‌పాటి సెంటిమెంట్‌. ఆయ‌న తొలి సినిమా 'ఈగ' అదే రోజున విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించింది. అందుకే 'విజేత'ను కూడా అదే తేదీన విడుద‌ల చేయ‌బోతున్నారు. దీంతో మెగా హీరోలిద్దరూ ఒకే వేదికపై పోటీపడుతున్నారు. మొత్తంమీద ఈ పోటీలో ఎవరు గెలుస్తారో కాలమే సమాధానం చెప్పాలి.