శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 13 జూన్ 2018 (10:37 IST)

మా నాన్న ఇక విశ్రాంతి తీసుకుంటే మంచిది : ఐశ్వర్య

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈమె భర్త, తమిళ యువ హీరో ధనుష్ నిర్మాతగా మారి రజినీకాంత్ హీరోగా నిర్మించిన చిత్రం "కాలా". ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈమె భర్త, తమిళ యువ హీరో ధనుష్ నిర్మాతగా మారి రజినీకాంత్ హీరోగా నిర్మించిన చిత్రం "కాలా". ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో రజినీ ఫ్యామిలీ అంతా 'కాలా' విజయోత్సవ సంబరాల్లో మునిగిపోయివున్నారు.
 
ఈ నేపథ్యంలో ఐశ్వర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నాన్న ఇకపై సినిమాలు మానేసి, కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తే బాగుంటుంది' అని వ్యాఖ్యానించింది. తన నటన ద్వారా ఎంతో మంది సినీ అభిమానులను అలరిస్తున్న నాన్న... పూర్తిగా ఆ రంగంపైనే దృష్టిని కేంద్రీకరించడం తగదని హితవు పలికింది. 
 
అలాగనీ, అర్జెంటుగా సినీ ఇండస్ట్రీని వదిలివేయాలని తాను కోరడం లేదని, క్రమంగా సినిమాలను తగ్గించుకుంటూ, కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరింది. సంతోషమొస్తే ఎక్కువగా పొంగిపోకూడదని, దు:ఖం వస్తే కుంగిపోకూడదని నాన్న చెప్పే మాటలు తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. సుఖదు:ఖాలను సమానంగా భరించాలనేదే తన తండ్రి సిద్ధాంతమని ఐశ్వర్య చెప్పుకొచ్చింది. 
 
ఇకపోతే, కాలా చిత్రానికి మంచి హిట్ టాక్‌ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. పైగా, ఈ చిత్రంతో తన భర్త నిర్మాత కూడా రాణించగలడనే నమ్మకం కుదిరిందనీ, ఈ విషయాన్ని తన తండ్రే స్వయంగా చెప్పారని ఐశ్వర్య తెలిపింది.