శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : సోమవారం, 11 జూన్ 2018 (14:38 IST)

షారూఖ్ ఖాన్ కుమార్తె ఫోజులు చూస్తే..?

బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. షారూఖ్ ఖాన్ కుమార్తె త్వరలో బాలీవుడ్ తెరంగేట్రం చేయబోతుందనే వార్తలు బిటౌన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. సుహానా

బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. షారూఖ్ ఖాన్ కుమార్తె త్వరలో బాలీవుడ్ తెరంగేట్రం చేయబోతుందనే వార్తలు బిటౌన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. సుహానా లండన్‌లో చదువు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. అక్కడ పర్యాటక ప్రదేశాలను తన తల్లి గౌరీఖాన్‌తో కలిసి చూసొచ్చింది. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.
 
సిల్వర్‌ కలర్‌ దుస్తుల్లో అదిరిపోయే సుహానా ఫోటోలు షారూఖ్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలకు అమ్మడు ఇచ్చిన ఫోజులను చూస్తే సుహానా ఖాన్ త్వరలోనే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. 
 
సామాజిక మాధ్యమాల్లో ఆమెకున్న క్రేజ్‌ను ఉపయోగించుకుని.. హీరోయిన్‌గా బిటౌన్‌కు ఎంట్రీ ఇస్తుందని అభిమానులు భావిస్తున్నారు. చదువు పూర్తి కావడంతో ఇక పూర్తిస్థాయిగా నటనపై షారూఖ్ కుమార్తె దృష్టి పెట్టే యోచనలో వున్నట్లు తెలుస్తోంది.