శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: శుక్రవారం, 8 జూన్ 2018 (12:11 IST)

రాధిక కుమార్తెకు బాబు పుట్టాడా..!

ప్రముఖ సీనియ‌ర్ నటి రాధికా శరత్‌కుమార్ అమ్మమ్మ అయ్యింది. అవును... ఈ విష‌యాన్ని రాధికా స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. ఆమె కుమార్తె రయన్నె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రాధికా తన ట్విట్టర్ అకౌంట్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు

ప్రముఖ సీనియ‌ర్ నటి రాధికా శరత్‌కుమార్ అమ్మమ్మ అయ్యింది. అవును... ఈ విష‌యాన్ని రాధికా స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. ఆమె కుమార్తె రయన్నె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రాధికా తన ట్విట్టర్ అకౌంట్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 
 
‘‘సో సో హ్యాపీ.. గాడ్ బ్లెస్..’’ అంటూ ‘ఇట్స్ ఏ బాయ్’ అనే చిత్రాన్ని పోస్ట్ చేశారు. రయన్నె 2016లో క్రికెటర్ అభిమన్యు మిథున్‌ను పెళ్లాడింది. ఇంత‌కీ రాధికా కుమార్తె ఎవ‌రంటే... రాధిక రెండో భర్త రిచర్డ్ హార్డిల కుమార్తె రయన్నె. 1992లో ఆయనకు విడాకులిచ్చింది. ఆ త‌ర్వాత‌ 2001లో శరత్ కుమార్‌ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం రాధిక ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.... మరోవైపు డైలీ సీరియల్ నిర్మాతగా బిజీగా ఉన్నారు.