మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 7 జూన్ 2018 (12:58 IST)

యాంకర్ సుమ.. ఐస్‌క్రీమ్ తింటే నోట్లోంచి, ముక్కులోంచి పొగలొచ్చాయ్.. ఎలా?

ఇదేంటి..? ఐస్‌క్రీమ్ తింటే నోట్లో నుంచి.. ముక్కులోంచి పొగలొస్తాయా అనుకుంటున్నారు కదూ.. అయితే ఈ స్టోరీ చదవండి. తెలుగు యాంకర్‌ సుమ తనదైన శైలిలో విసిరే పంచ్‌లతో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంద

ఇదేంటి..? ఐస్‌క్రీమ్ తింటే నోట్లో నుంచి.. ముక్కులోంచి పొగలొస్తాయా అనుకుంటున్నారు కదూ.. అయితే ఈ స్టోరీ చదవండి. తెలుగు యాంకర్‌ సుమ తనదైన శైలిలో విసిరే పంచ్‌లతో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే ఈమె.. తాజాగా ఓ చోట ఐస్‌క్రీమ్ తింటూ వీడియో తీసుకుంది. అది మామూలు ఐస్‌క్రీమ్ కాదు. 
 
ఎంతో చల్లగా వుండే ఆ ఐస్‌క్రీమ్‌ను తింటే నోట్లోంచి.. ముక్కులోంచి పొగలు వచ్చేస్తాయ్. ఆ ఐస్‌క్రీమ్‌ను సుమ తింటూ తనదైన శైలిలో హావభావాలు ఒలకబోస్తూ.. ఐస్‌క్రీమ్ రుచిని ఆస్వాదిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను సుమ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.