శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 25 నవంబరు 2017 (13:50 IST)

సినిమా ఛాన్సెస్ రావడం లేదని సుమ క్లాస్ పీకింది : రాజీవ్ క‌న‌కాల‌

తనకు సినీ అవకాశాలు తగ్గిపోవడానికిగల కారణాలను సినీ నటుడు రాజీవ్ కనకాల వివరించారు. పైగా, ఈ అవకాశాలు తగ్గిపోవడంతో ఆయన భార్య ఏమన్నారో కూడా వెల్లడించారు. తాజాగా రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో అనే

తనకు సినీ అవకాశాలు తగ్గిపోవడానికిగల కారణాలను సినీ నటుడు రాజీవ్ కనకాల వివరించారు. పైగా, ఈ అవకాశాలు తగ్గిపోవడంతో ఆయన భార్య ఏమన్నారో కూడా వెల్లడించారు. తాజాగా రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో అనేక విషయాలపై స్పందించారు.
 
ముఖ్యంగా, తన సినీ అవకాశాలపై ఆయన మాట్లాడుతూ, సాధారణంగా 'ఇండస్ట్రీలో వ‌రుస‌గా అవ‌కాశాలు ద‌క్కించుకోవాలంటే సినిమా వాళ్ల‌తో రెగ్యుల‌ర్‌గా ట‌చ్‌లో ఉండాలి. రోజూ ఫోన్ చేసి ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఏదైనా క్యారెక్ట‌ర్ ఉంటే చూడండి?' అంటూ అడుగుతూ వుండాలి. ఇలా ప్రతి రోజూ హాజరు వేయించుకుంటేనే అవకాశాలు వస్తుంటాయి.
 
కానీ, తాను అలా అడ‌గడానికి ఇష్ట‌ప‌డ‌ను. నాకు సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది స్నేహితులున్నారు. వాళ్ల‌తో స‌ర‌దాగా టైమ్ స్పెండ్ చేసే స‌మ‌యంలో సినిమాల గురించి మాట్లాడ‌ను. ప్రెండ్‌షిప్ వేరు.. ప్రొఫెష‌న్ వేరు అని భావిస్తా. అందుకే నాకు అనుకున్న‌న్ని అవ‌కాశాలు రావ‌డం లేదని తెలుసుకున్నా. ఈ విషయాన్ని నా భార్య సుమ గ్రహించి ఓ రోజున క్లాస్ పీకింది. అయినప్పటికీ.. సినీ అవకాశాల కోసం ఒకర్ని అడగటం నా మనస్సు అంగీకరించలేదు అని రాజీవ్ కనకాల వివరించారు.