గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శుక్రవారం, 17 నవంబరు 2017 (19:08 IST)

పిల్లల ముందే తన కోర్కె తీర్చాలంటూ భార్యపై ఎగబడ్డాడు... కోసేసింది...

పూటుగా పీకల దాకా తాగి, ఆ మత్తులో తనకు లైంగిక సుఖం కావాలంటూ భార్యపై ఎగబడ్డాడు ఓ వ్యక్తి. అది కూడా కన్నబిడ్డలు ఎదురుగా వుండగానే ఆమెపైకి ఎగబడుతుండటంతో ఆమె ఎంతో బ్రతిమాలింది. ఐనా వినకపోయేసరికి అతడి వ్యక్తిగత భాగాన్ని పదునైన కత్తితో కోసిపారేసింది.

వివరాల్లోకి వెళితే... తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో వుంటున్న సదరు వ్యక్తికి రోజూ మద్యం సేవించనిదే పొద్దు గడవదు. ఎప్పుడూ పూటుగా మద్యం సేవించడం, కోర్కె తీర్చాలంటూ భార్యపై ఎగబడటం నిత్యకృత్యంగా మారింది. పిల్లలు లేని సమయంలో ఎలాగో నెట్టుకొచ్చిన ఆ భార్య, కన్నబిడ్డలు ఎదురుగా వుండగానే తన కోర్కె తీర్చాలంటూ వేధించడాన్ని తట్టుకోలేకపోయింది. 
 
అతడిని ఎంతగానో బ్రతిమాలింది. కానీ అతడు ఎంతమాత్రం వినకపోయేసరికి చేసేదిలేక పదునైన కత్తి తీసుకుని అతడి వ్యక్తిగత భాగాన్ని కోసిపారేసింది. దీనితో తీవ్ర రక్తస్రావంతో గిలగిలలాడిపోతున్న అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆమెపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసారు. కానీ, ఇరుగుపొరుగువారు, అతడే పశువులా ప్రవర్తించి భార్యను నానా హింసలకు గురిచేస్తుండేవాడనీ, ఆమె చాలా రోజులుగా నెట్టుకొస్తుందనీ, ఇంకెవరైనా అయితే ఆ పని ఎప్పుడో చేసి వుండేవారని అంటున్నారు.