గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 20 నవంబరు 2017 (14:32 IST)

భర్త ఆ మాత్రలు వేసుకుని వేధించాడు.. భార్య చంపిచేసింది..

వయాగ్రా మాత్రలేసుకుని తనను లైంగికంగా వేధించే భర్తను హతమార్చించింది.. ఓ భార్య. ఈ ఘటన తమిళనాడులోని సేలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సేలం జిల్లాకు చెందిన కవియరసు (42). ఇతనికి వివాహమై ఇద్దరు పిల

వయాగ్రా మాత్రలేసుకుని తనను లైంగికంగా వేధించే భర్తను హతమార్చించింది.. ఓ భార్య. ఈ ఘటన తమిళనాడులోని సేలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సేలం జిల్లాకు చెందిన కవియరసు (42). ఇతనికి వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. మనస్పర్ధల కారణంగా గత రెండేళ్లకు ముందు ఇతడు తొలి భార్యకు దూరమయ్యాడు. ఆపై ధర్మపురిలో నివాసం ఏర్పరుచుకున్నాడు. 
 
అక్కడ నిర్మల (23) అనే యువతితో ఏర్పడిన పరిచయం.. ప్రేమగా మారింది. ఆపై వీరిద్దరికీ వివాహం కూడా జరిగింది. కానీ కవియరసు అధికంగా వయాగ్రా మాత్రలు తీసుకుంటూ.. నిర్మలను తరచూ లైంగికంగా వేధించడం మొదలెట్టాడు. అనేక సార్లు భర్తను ఈ అలవాటొద్దని హెచ్చరించినా... అతడు తనను మార్చుకోలేదు. ఈ వ్యవహారాన్ని నిర్మల తన మాజీ  ప్రేమికుడు అభినేష్ (27)తో చెప్పుకుంది.
 
అతడు రూ.52వేలు కిరాయి హంతుకుడికిచ్చి కవియరసును హతమార్చేలా చేశాడు. ఈ నేపథ్యంలో కుమారుడు కనిపించలేదని.. కవియరసు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిర్మల వద్ద జరిపిన విచారణలో భర్త వేధింపులు తాళలేకే చంపినట్లు ఒప్పుకుంది.