మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 16 జనవరి 2018 (12:34 IST)

పులిహోర చేసిన యాంకర్ సుమ కనకాల (video)

యాంకరింగ్‌తో నవ్వులు పూయించే సుమ కనకాల.. తాజాగా చింతపండు పులిహోరను తయారు చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బుల్లితెరపై టీవీపై పంచులు, జోకులతో అలరించే సుమ.. ఇంట్లోనూ సరదాగా వుంటుంది. స

యాంకరింగ్‌తో నవ్వులు పూయించే సుమ కనకాల.. తాజాగా చింతపండు పులిహోరను తయారు చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బుల్లితెరపై టీవీపై పంచులు, జోకులతో అలరించే సుమ.. ఇంట్లోనూ సరదాగా వుంటుంది.

సంక్రాంతి సందర్భంగా ఇంట్లో పులిహోర తయారు చేసింది. ఈ వీడియోలో సంక్రాంతికి తాను పులిహోరతో పాటు మరెన్నో చేస్తున్నానని, మీరందరూ ఈ రోజు ఏం చేస్తున్నారని సుమ అడిగింది. 
 
చివరికి హ్యాపీ సంక్రాంతి అని పేర్కొంది. 'పులిహోరా.. చింతపండు పులిహోర చేస్తున్నాను. దిస్ ఈజ్ ది గుజ్జు. ఇదిగో పులిహోర. ఎవరైనా తినడానికి వస్తున్నారా ఇవాళ.. అంటూ ప్రశ్నించింది. 
 
సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా బిజీగా ఉన్నానని తన ఫేస్‌బుక్ ద్వారా తెలుపుతూ ఓ వీడియో పోస్ట్ చేసింది. బుల్లితెరపై సందడి చేస్తూ.. వెండితెరపై ఛాన్సులు కొట్టేసిన అనసూయ, రష్మీలా సుమ కూడా యాంకర్‌గానూ, గృహిణిగా, కళాకారణిగా పలు  బాధ్యతలను నిర్వర్తిస్తూ మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. తాజాగా సుమ పులిహోర ఎలా చేసిందో ఈ వీడియో ద్వారా చూద్దాం..