శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 30 జూన్ 2018 (11:25 IST)

జీబీలు కాదు.. టెర్రాబైట్ల డేటా : రిలయన్స్ జియో బంపర్ ఆఫర్

దేశ టెలికాం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న రిలయన్స్ జియో.. తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటివరకు ఇంటర్నెట్ డేటాను జీబీల్లో ఆఫర్ చేస్తూ మొబైల్ వినియోగదారులను తనవైపునకు ఆకర్షించిన జియో.. ఇపుడు ఏకంగ

దేశ టెలికాం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న రిలయన్స్ జియో.. తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటివరకు ఇంటర్నెట్ డేటాను జీబీల్లో ఆఫర్ చేస్తూ మొబైల్ వినియోగదారులను తనవైపునకు ఆకర్షించిన జియో.. ఇపుడు ఏకంగా టెర్రాబైట్లలో 4జీ డేటాను ఇవ్వనుంది.
 
జియో ఒప్పో మాన్‌సూన్‌ ఆఫర్‌ పేరుతో దీన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త స్కీమ్‌ కింద యూజర్లు 3.2 టీబీ జియో 4జీ డేటాను పొందనున్నారు. 4900 రూపాయల వరకు ప్రయోజనాలను జియో తన ప్రీపెయిడ్‌ యూజర్లకు ఆఫర్‌ చేస్తుంది. ఈ ఆఫర్‌ పాత లేదా కొత్త జియో సిమ్‌ను కలిగి ఉన్న ఒప్పో ఫోన్‌ యూజర్లందరికీ అందుబాటులో ఉంది. 
 
ఈ ఆఫర్‌ పొందడానికి కొత్త ఒప్పో ఫోనే కొనుగోలు చేయాల్సినవసరం లేదు. జూన్‌ 28 నుంచి ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంది. అయితే ఈ ఆఫర్‌ను పొందడానికి మాత్రం సబ్‌స్క్రైబర్లు 198 రూపాయలు, 299 రూపాయల జియో ప్రీపెయిడ్‌ ప్లాన్లతో తమ ఫోన్లకు రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ కింద యూజర్లు 3.2 టెరాబైట్ల 4జీ డేటాను, రూ.4,900 వరకూ ప్రయోజనాలను పొందవచ్చని సంస్థ తెలిపింది.