1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Free Amazon Prime membership with these Vodafone RED postpaid plans

అలా చేస్తే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితం... వారికి మాత్రమే...

అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ ఉచితంగా లభించనుంది. ఇందుకోసం నెటిజన్లు లేదా మొబైల్ వినియోగదారులు చేయాల్సిందల్లా ఒక్కటే. వోడాఫోన్ మొబైల్ నంబరును కలిగివుండటమే. అమెజాన్ సంస్థతో భాగస్వామ్యం అయిన వొడాఫోన్ ఈ ఆఫ

Amazon Prime membership
అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ ఉచితంగా లభించనుంది. ఇందుకోసం నెటిజన్లు లేదా మొబైల్ వినియోగదారులు చేయాల్సిందల్లా ఒక్కటే. వోడాఫోన్ మొబైల్ నంబరును కలిగివుండటమే. అమెజాన్ సంస్థతో భాగస్వామ్యం అయిన వొడాఫోన్ ఈ ఆఫర్‌ను తన కస్టమర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. అయితే, వోడాఫోన్ అందిస్తున్న ప్లాన్లలో రెడ్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను తీసుకున్న వారికి లేదా ఇప్పటికే ఆ ప్లాన్లలో ఉన్నవారికి మాత్రమే ఇది వర్తిస్తుందన్న నిబంధన విధించింది.
 
వొడాఫోన్ అందిస్తున్న ఈ ఆఫర్‌ను పొందాలంటే ఆ కంపెనీకి చెందిన యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి ముందుగా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే యాప్‌ను వాడే వారు దాన్ని కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేయాలి. ఆ తర్వాత యాప్‌ను ఓపెన్ చేస్తే అందులో హోమ్ పేజీలో అమెజాన్ ఆఫర్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. 
 
ఆ పిమ్మట వచ్చే స్క్రీన్‌లో మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేస్తే ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి కన్‌ఫాం చేయాలి. దీంతో ఆఫర్ లభిస్తుంది. అనంతరం కస్టమర్ ఎంచుకున్న ఈ-మెయిల్ ఐడీకి ఆఫర్‌ను ఇస్తారు. దాంతో అమెజాన్ ప్రైమ్ కస్టమర్‌గా లాగిన్ అయితే చాలు, అమెజాన్ ప్రైమ్ మెంబర్ అవుతారు. అలా రూ.999 విలువైన ఏడాది అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‍ను వొడాఫోన్ కస్టమర్లు ఉచితంగా పొందవచ్చు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
నా భర్త నన్ను ప్రాణాలతో వుంచుతాడనే ఆశ లేదు... తెదేపా యూత్ లీడర్ భార్య ఆవేదన