శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 19 జూన్ 2018 (15:21 IST)

రిలయన్స్ జియో అదుర్స్.. అన్నీ ప్లాన్లలో అదనంగా ఉచిత డేటా..!

ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. టెలికాం రంగం సంస్థలకు పోటీ ఇచ్చే దిశగా తన అన్నీ రకాల ప్లాన్లలో ఉచిత డేటా పరంగా మార్పులు చేసింది. ఇందులో భాగంగా రూ.299లో ఇప్పటిదాకా రోజూ

ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. టెలికాం రంగం సంస్థలకు పోటీ ఇచ్చే దిశగా తన అన్నీ రకాల ప్లాన్లలో ఉచిత డేటా పరంగా మార్పులు చేసింది. ఇందులో భాగంగా రూ.299లో ఇప్పటిదాకా రోజూ 3జీబీ డేటాను 28 రోజుల పాటు ఆఫర్ చేసింది.
 
ఇకపై అదనంగా ఇకపై అదనంగా ప్రతి రోజూ 1.5 జీబీ డేటాను పొందొచ్చు. మొత్తం మీద ప్రతి రోజూ 4.5 జీబీ డేటా చొప్పున 28 రోజుల పాటు సేవలు పొందవచ్చునని జియో ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్ ఈ నెల 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. 
 
ఇదే ప్లాను కింద ఉచితంగా అన్‌లిమిటెడ్ కాల్స్, ప్రతిరోజూ వంద ఎస్సెమ్మెస్‌లను కూడా ఉచితంగా పొందవచ్చును. ఇదే తరహాలో రూ.149, రూ.349, రూ.399, రూ.449 ప్లాన్లలో ప్రస్తుతం ప్రతి రోజూ 1.5 జీబీ లభిస్తుండగా, ఇకపై రోజూ 3జీబీ డేటా ఉచితంగా పొందే అవకాశం వుంటుంది. 
 
రూ.198, రూ.398, రూ.448, రూ.498 ప్లాన్లలో 2జీబీ డేటాకు బదులు 3.5 జీబీ డేటా, అలాగే ప్రతి రోజూ 4జీబీ డేటాతో కూడిన రూ.509 ప్లాన్‌లో ఇకపై ప్రతి రోజూ 5.5 జీబీ డేటా లభిస్తుంది. రూ.799తో కూడిన 5జీబీ డేటా ప్యాక్‌లో రోజూ 6.5 జీబీ డేటాను పొందవచ్చునని జియో ప్రకటించింది.