శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 16 జూన్ 2018 (20:56 IST)

కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటానంటున్న చంద్రబాబు

ఎపి అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వకపోవడంపై ఇప్పటికే అగ్గి మీద గుగ్గిలమవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే టిడిపి-బిజెపి పార్టీలు విడిపోయిన తరువాత ఒకరినొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్న

ఎపి అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వకపోవడంపై ఇప్పటికే అగ్గి మీద గుగ్గిలమవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే టిడిపి-బిజెపి పార్టీలు విడిపోయిన తరువాత ఒకరినొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఎపిలో నెలకొన్న పరిస్థితులను కేంద్రానికి వివరించేందుకు బాబు ఢిల్లీ బయలుదేరారు. 24 పేజీల నివేదికను సిద్ధం చేసుకుని మరీ చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
 
రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. 15వ ఆర్థిక సంఘ విధివిధానాల సవరణలపై తనకున్న అభ్యంతరాలను చంద్రబాబు వివరించనున్నారు. అలాగే రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, కేంద్రం ఎపికి ఇప్పటివరకు ఇచ్చిన నిధులు, ఇవ్వాల్సిన నిధులపై కూడా చర్చించనున్నారు. బిజెపితో విడిపోయిన తరువాత చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్ళడం... అందులోను 24 పేజీల నివేదికను తయారుచేసుకుని మరీ కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు వెళ్ళడంతో ఒక్కసారిగా ఎపిలో చర్చకు దారితీస్తోంది.