బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 జూన్ 2018 (16:09 IST)

రూమ్ నంబర్ 2018కు 2 సార్లు, రూమ్ నంబర్ 404కు ఒక్క సారి... ఆ హీరోయిన్ ఎవరు?

అమెరికాలోని చికాగోలో వెలుగు చూసిన టాలీవుడ్ వ్యభిచార దందాలో పాలుపంచుకున్న పలువురు హీరోయిన్ల పేర్లు బయటకు వచ్చేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, ఈ వ్యభిచార దందాను నిర్వహిస్తూ వచ్చిన ఎన్నారై దంపతులు మోదుగుమూ

అమెరికాలోని చికాగోలో వెలుగు చూసిన టాలీవుడ్ వ్యభిచార దందాలో పాలుపంచుకున్న పలువురు హీరోయిన్ల పేర్లు బయటకు వచ్చేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, ఈ వ్యభిచార దందాను నిర్వహిస్తూ వచ్చిన ఎన్నారై దంపతులు మోదుగుమూడి కిషన్ అలియాస్ చెన్నుపాటి శ్రీరాజ్, అతని భార్య చంద్రకళా పూర్ణిమ అలియాస్ విభాజయంలు రాసుకున్న డైరీలో పలువురు హీరోయిన్ల పేరు వెలుగు చూస్తున్నాయి.
 
ఇందులోభాగంగా, చికాగోలో జరిగిన ఓ స్టార్‌నైట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు టూరిస్ట్ వీసాపై అమెరికా వెళ్లిన ఓ హీరోయిన్ జనవరి 19వ తేదీన ఉదయం చికాగోలోని ఓ లగ్జరీ హోటల్‌లో రూమ్ నంబర్ 2018లో రెండు సార్లు, రూమ్ నంబర్ 404లో ఒకసారి వెళ్లినట్టు ఆ డైరీలో రాసుకుంది. ఈ హీరోయిన్ ఎవరన్నదానిపై చికాగో పోలీసులు కూపీ లాగుతున్నారు. 
 
ఇక చికాగోలోని కిషన్ నివాసంపై దాడులు చేసిన తమకు హీరోయిన్ల కోసం బుక్ చేసిన విమానం టికెట్లు, హోటల్ రూముల తాలూకు బుకింగ్స్ వివరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, కిషన్ ఇంట్లో 70 కండోమ్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. కిషన్ భార్య చంద్రకళ హీరోయిన్ల రాకపోకలపై ఓ డైరీ రాసిందని, అదే తమకు కీలక ఆధారంగా ఉన్నట్టు పోలీసులు కోర్టుకు సమర్పించిన డైరీలో పేర్కొన్నారు. 
 
ఈ డైరీలో ఓ ప్రముఖ తెలుగు నటి పేరుంది. "వాషింగ్టన్ డీసీ - జనవరి 19 ఉదయం - రూమ్ నంబర్ 2018లో రెండు సార్లు, తరువాత రూమ్ నంబర్ 404లో ఒకసారి" అని రాసుంది. ఈ నటి ఎవరన్నదానిపై టాలీవుడ్ వర్గాలు ఆరా తీస్తున్నాయి.