రూ.49కే ఫ్రీ కాల్స్ : జియో ఫీచర్ ఫోన్ యూజర్లకు మాత్రమే...

దేశీయ టెలికాం రంగంలో అడుగుపెట్టినప్పటి నుంచి రిలయన్స్ జియో తన ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. నెలకో రకమైన ఆకర్షణీయమైన ప్లాన్‌ను ప్రకటిస్తూ మరింతమంది కష్టమర్లను తనవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్త

reliance jio
pnr| Last Updated: శనివారం, 27 జనవరి 2018 (14:40 IST)
దేశీయ టెలికాం రంగంలో అడుగుపెట్టినప్పటి నుంచి రిలయన్స్ జియో తన ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. నెలకో రకమైన ఆకర్షణీయమైన ప్లాన్‌ను ప్రకటిస్తూ మరింతమంది కష్టమర్లను తనవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది.

తాజాగా, జియో 4జీ ఫీచర్ ఫోన్‌ను వాడుతున్న వినియోగదారులకు ఓ శుభవార్త తెలిపింది. భారత గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఈ ఆఫర్‌ను ప్రకటించింది.

4జీ ఫీచర్‌ ఫోన్‌ యూజర్ల కోసం రూ.49 ప్లాన్‌ను ఆవిష్కరించింది. దీనిలో ఉచిత వాయిస్‌ కాల్స్‌, 1జీబీ 4జీ డేటాతో పాటు 28 రోజుల వాలిడిటీ ఉంటుంది. అలాగే వీరి కోసం రూ.11, రూ.21, రూ.51, రూ.101 ధరల్లో డేటా యాడ్‌–ఆన్‌ ప్లాన్‌లను ప్రకటించింది.దీనిపై మరింత చదవండి :