వోడాఫోన్ న్యూ ప్లాన్.. రోజుకు 2 జీబీ డేటా

ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన వోడాఫోన్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో భాగంగా రూ.348 ప్యాక్‌ను వేయించుకునే వినియోగదారులు ఇకపై రోజుకు 2జీబీ డేటాను పొందవచ

vodafone
pnr| Last Updated: గురువారం, 14 డిశెంబరు 2017 (11:33 IST)
ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన వోడాఫోన్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో భాగంగా రూ.348 ప్యాక్‌ను వేయించుకునే వినియోగదారులు ఇకపై రోజుకు 2జీబీ డేటాను పొందవచ్చు.

వాస్తవానికి ఈ ప్యాక్ కింద ఇప్పటివరకు రోజుకు 1జీబీ డేటాను మాత్రమే అందిస్తూ వచ్చారు. కానీ ఇకపై రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. ఈ మేరకు వొడాఫోన్ ఈ ప్లాన్‌ను అప్‌గ్రేడ్ చేసింది.

ఇక ఈ ప్లాన్ టారిఫ్ దేశంలో ఉన్న సర్కిళ్లను బట్టి మారుతుంది. కాగా ఈ ప్లాన్‌లో వినియోగదారులకు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ లభిస్తాయి. వాటిని రోజుకు 250 నిమిషాలు, వారానికి ఒక్క వేయి నిమిషాల వరకు వాడుకోవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది.దీనిపై మరింత చదవండి :