గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: బుధవారం, 13 డిశెంబరు 2017 (16:03 IST)

నాకో అవకాశం ఇస్తే చూపిస్తానంటున్న స్వాతి రెడ్డి

బుల్లితెరతో నటనను ప్రారంభించి వెండితెరపై తళుక్కున మెరిసి ఆ తరువాత కనిపించకుండా పోయింది హీరోయిన్ స్వాతిరెడ్డి. డేంజర్ సినిమాతో ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని అష్టాచమ్మ, కార్తీకేయ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. కానీ ఆ తరువాత

బుల్లితెరతో నటనను ప్రారంభించి వెండితెరపై తళుక్కున మెరిసి ఆ తరువాత కనిపించకుండా పోయింది హీరోయిన్ స్వాతిరెడ్డి. డేంజర్ సినిమాతో ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని అష్టాచమ్మ, కార్తీకేయ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. కానీ ఆ తరువాత సినిమా ఛాన్సులు లేక స్వాతి రెడ్డి ఇబ్బంది పడుతోంది. 
 
స్వాతిరెడ్డి ఇప్పుడు తను ఖాళీగా వున్నానంటూ ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ తిరుగుతోందట. అవకాశాలు లేకపోవడంతోనే స్వాతిరెడ్డి ఇలా చెబుతోందని బంధువులు చెబుతుంటే, స్నేహితులు మాత్రం స్వాతిరెడ్డిని ఆటపట్టిస్తున్నారట. గతంలో తనతో సినిమాలు చేసిన కొంతమంది యువ దర్శకులను వెళ్ళి కూడా స్వాతిరెడ్డి కలుస్తోందట. 
 
అంతేకాదు యువ హీరోలను కూడా కలిసి వారి సినిమాల్లో తనకో అవకాశం ఇవ్వాలని కోరుతోందట స్వాతిరెడ్డి. అందరూ సరేనంటున్నారు కానీ స్వాతిరెడ్డికి మాత్రం సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది.