సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 13 డిశెంబరు 2017 (09:49 IST)

హ్యాపీ బర్త్ డే టు విక్టరీ వెంకటేష్ : యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు..

తెలుగు చిత్రపరిశ్రమలోని సీనియర్ హీరోల్లో ఒకరు విక్టరీ వెంకటేష్. సక్సెస్‌ఫుల్ సినిమాలతో విక్టరీనే తన ఇంటిపేరుగా మార్చుకున్న వెంకీ... వైవిద్యభరితమైన సినిమాల్లో నటిస్తూ యువ హీరోలతో పోటీపడుతున్నాడు.

తెలుగు చిత్రపరిశ్రమలోని సీనియర్ హీరోల్లో ఒకరు విక్టరీ వెంకటేష్. సక్సెస్‌ఫుల్ సినిమాలతో విక్టరీనే తన ఇంటిపేరుగా మార్చుకున్న వెంకీ... వైవిద్యభరితమైన సినిమాల్లో నటిస్తూ యువ హీరోలతో పోటీపడుతున్నాడు. ఈ సీనియర్ హీరో పుట్టినరోజు వేడుకలను బుధవారం జరుపుకుంటున్నాడు.
 
1960 డిసెంబర్ 13వ తేదీన జన్మించిన వెంకి 1986లో 'కలియుగ పాండవులు' సినిమాతో మూవీ మోఘల్ రామానాయుడి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఇక వెంకీ వెనక్కి చూడలేదు. ఆ తర్వాత ఆయన నటించిన అనేక చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆయన కెరీర్‌లో ఐదు నంది అవార్డులు అందుకున్నాడు. 
 
'కలిసుందాం రా.., నువ్వునాకు నచ్చావ్, ఆడవారి మాటలకు అర్ధాలేవేరులే' వంటి ఫ్యామిలీ సినిమాలేకాకుండా.. 'శత్రువు, బొబ్బిలిరాజా, క్షణం క్షణం ఘర్షణ' వంటి యాక్షన్.. 'ప్రేమ, చంటి, ప్రేమించుకుందాం..రా, ప్రేమంటే ఇదేరా, ప్రేమతో.. రా' వంటి లవ్ స్టోరీలతో తిరుగులేని విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. తక్కువ బడ్జెట్ చిత్రాలైన 'ఈనాడు, దృశ్యం, గురు' వంటి చిత్రాల్లో నటించి మంచి హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
ఏమాత్రం భేషజాలకు పోనీ ఈ సీనియర్ హీరో 1985 డిసెంబర్ 13న నీరజను పెళ్లి చేసుకున్నారు. ఇంకో విషయం ఏమిటంటే వెరైటీగా ఆయన బర్త్ డే రోజునే (డిసెంబర్ -13 ) మ్యారేజ్ చేసుకున్న వెంకీకి ముగ్గురు కూతుళ్లు, కొడుకు. ఇలా ఏం చేసినా వెరైటీగా ఉండేలా ప్లాన్ చేసుకునే వెంకీ.. సినిమాల ఎంపికలోనూ సక్సెస్ అయ్యారు. 
 
అదేసమయంలో ఏఎన్నార్, ఎన్టీఆర్, శోభన్ బాబు తర్వాత కనుమరుగైపోయిన మల్టీస్టారర్ సినిమాలకు తొలిసారి పచ్చజెండా ఊపింది కూడా వెంకీనే. ప్రిన్స్ మహేష్ బాబుతో 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు', యువ హీరో రామ్‌తో 'మసాలా', పవన్ కళ్యాణ్‌తో 'గోపాల గోపాల' వంటి చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో 'ఆట నాదే వేట నాదే' ఆనే సినిమాలో నటిస్తున్న విక్టరీ వెంకటేష్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు.