శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 12 డిశెంబరు 2017 (22:10 IST)

రీనాక్ పర్వతాన్ని అధిరోహించి విద్యార్థినీవిద్యార్థులు: అభినందించిన మంత్రి నక్కా

అమరావతి : గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న 27 మంది విద్యార్థులు డార్జిలింగ్‌లో రీనాక్ పర్వతాన్ని (6,400 మీటర్లు) అధిరోహించి జాతీయ పతాకం ఎగురవేసి వచ్చిన విద్యార్థినీవిద్యార్థులను సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖమంత్రి నక్కా ఆనందబాబు అభినందించిన

అమరావతి : గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న 27 మంది విద్యార్థులు డార్జిలింగ్‌లో రీనాక్ పర్వతాన్ని (6,400 మీటర్లు) అధిరోహించి జాతీయ పతాకం ఎగురవేసి వచ్చిన విద్యార్థినీవిద్యార్థులను సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖమంత్రి నక్కా ఆనందబాబు అభినందించినారు. మంగళవారం మంత్రి నక్కా ఆనందబాబు చాంబర్లో రీనాక్ పర్వాతన్ని అధరోహించిన విద్యార్థులు కలవడం జరిగింది. 
 
డార్జిలింగ్‌లో రీనాక్ పర్వతాన్ని అధిరోహించిన విద్యార్థులు, లడాఖ్ క్యాంపు విజయవంతం చేసుకుని, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి దేశానికి, రాష్ట్రనికి పేరు ప్రఖ్యాతలు తీసుకుని రావాలని మంత్రి నక్కా ఆనందబాబు ఆకాంక్షించారు. గత సంవత్సరం సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థులు 9 మంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి గొప్ప రికార్డ్ నెలకొల్పారు. వీరిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా సత్కరించి తగిన ప్రోత్సహకాలు ఇవ్వడం జరిగింది. 
 
ఎవరెస్ట్‌కు వెళ్లే విద్యార్థులకు ఒక్కొక్కరికి ప్రభుత్వం రూ.35 లక్షల వరకు ఖర్చు పెడుతుంది. విద్యార్థులకు ప్రభుత్వం అందించే సహాయాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి నక్కా ఆనందబాబు సూచించారు. ప్రతిభ ఉండే విద్యార్థుల్లో ఎంత ఖర్చయినాసరే వారిలో ఉన్న ప్రతిభను వెలికితీసి ప్రొత్సహించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశమని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరి శిషోడియా, డైరెక్టర్ గంధం చంద్రుడు, గురుకులం సెక్రటరీ డి.వాసు పాల్గొన్నారు.