మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 30 నవంబరు 2017 (14:31 IST)

ప్రిన్సిపాల్‌ను తిట్టారనీ అమ్మాయిలను నగ్నంగా నిల్చోబెట్టారు

విద్యాబుద్ధులు చెప్పాల్సిన పంతుళ్లు ఉన్మాదులుగా మారిపోతున్నారు. విద్యార్థులు తెలిసోతెలియక చేసే చిన్నపాటి తప్పులకే పెద్దపెద్ద శిక్షలు విధిస్తున్నారు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింద

విద్యాబుద్ధులు చెప్పాల్సిన పంతుళ్లు ఉన్మాదులుగా మారిపోతున్నారు. విద్యార్థులు తెలిసోతెలియక చేసే చిన్నపాటి తప్పులకే పెద్దపెద్ద శిక్షలు విధిస్తున్నారు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. ప్రిన్సిపాల్‌ను దూషించారన్న కారణంతో ఏకంగా 88 మంది విద్యార్థినులను వివస్త్రలను చేసి వరుసగా నిల్చోబెట్టారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పాపుమ్‌ పారే జిల్లా తాని హప్ప (ప్రస్తుతం సంగాలీ)లోని కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదివే కొంతమంది అమ్మాయిలు ప్రిన్సిపాల్‌కు వ్యతిరేక వ్యాఖ్యాలు చేశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఇద్దరు అసిస్టెంట్ టీచర్, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థినులపై అమానుషంగా ప్రవర్తించారు. సహచర విద్యార్థుల సమక్షంలోనే 88 మంది అమ్మాయిలను నగ్నంగా నిల్చోబెట్టారు. 
 
ఈ అమానుష సంఘటన ఈనెల 23వ తేదీన జరిగింది. కానీ బయటకు పొక్కలేదు. ఈ నేపథ్యంలో ఈనెల 27వ తేదీన బాధిత విద్యార్థినులు ఆల్‌ సంగాలీ విద్యార్థి సంఘం (ఏఎస్ఎస్‌యు)ను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఏఎస్‌ఎస్‌యూ నేతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.