శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 12 ఆగస్టు 2017 (13:38 IST)

కబడ్డీలో మెళకువలు నేర్పిస్తానంటూ క్రీడాకారిణికి పీఈటీ లైంగిక వేధింపులు

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే కామాంధుడయ్యాడు. కబడ్డీ ఆటలో మెళకువలు నేర్పిస్తానంటూ ఓ క్రీడాకారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే కామాంధుడయ్యాడు. కబడ్డీ ఆటలో మెళకువలు నేర్పిస్తానంటూ ఓ క్రీడాకారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తమిళనాడు రాష్ట్రంలోని భవానీసాగర్, అమ్మాపేట ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలో ఈ దారుణం వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఈ పాఠశాలలో ప్రభు (40) అనే వ్యక్తి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఈయన ఎనిమిదో తరగతి చదువుతున్న కబడ్డీ క్రీడాకారిణిని లైంగిక వేధించాడు. పక్క గ్రామంలో జరిగిన టోర్నమెంట్‌కు పాఠశాల కబడ్డీ జట్టు పాల్గొంది. 
 
తిరిగి వచ్చే క్రమంలో బస్సులో తనపై పీఈటీ ప్రభు లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆ క్రీడాకారిణి తల్లితండ్రులకు ఏడుస్తూ తెలిపింది. వెంటనే ఆమె తల్లితండ్రులు గ్రామ ప్రజలకు తెలియజేయడంతో 200 మంది బుధవారం పాఠశాల ముందుకు చేరి టీచర్‌ను అరెస్టు చేయాలంటూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు పీఈటీ ప్రభూను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. పీఈటీని సస్పెండ్‌ చేసినట్లు పాఠశాల వర్గాలు తెలిపాయి.