మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 21 జూన్ 2017 (09:49 IST)

బాలబాలికలపై ముంబై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు... పంతులుకి అరదండాలు

తనవద్ద చదివే బాలికలే కాదు.. బాలురపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడిన ముంబై కీచక ఉపాధ్యాయుడితో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు అరదండాలు వేయించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

తనవద్ద చదివే బాలికలే కాదు.. బాలురపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడిన ముంబై కీచక ఉపాధ్యాయుడితో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు అరదండాలు వేయించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ముంబై, ఉల్లాస్‌నగర్‌లో ప్రైవేట్ మరాఠీ మీడియం పాఠశాల ఉంది. ఇందులో 54 ఏళ్ల బాలచంద్ర భంగాలే అనే ఉపాధ్యాయుడు ఇద్దరు బాలికలు, ముగ్గురు బాలురను ఖాళీగా ఉన్న తరగతి గదిలోకి ఒకరికి తెలియకుండా మరొకరిని తీసుకువెళ్లి వారిని లైంగికంగా వేధించాడు. ఆపై ఈ విషయం గురించి ఎవరికీ చెప్పొద్దని పిల్లల్ని బెదిరించాడు. 
 
టీచర్ లైంగికవేధింపులు భరించలేని 8 యేళ్ళ బాలుడు పాఠశాలకు వెళ్లనని మొరాయించడంతో తల్లి కారణమైందని ఆరా తీయగా ఉపాధ్యాయుడి లైంగికవేధింపులు వెలుగుచూశాయి. దీంతో బాధిత బాలుడి తల్లి హిల్ కాలనీ పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసుల దర్యాప్తులో బాలచంద్ర భంగాలే మరో నలుగురిని కూడా లైంగికంగా వేధించాడని తేలింది. 
 
27 ఏళ్లుగా పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భంగాలే గతంలోనూ పలువురు బాల, బాలికలను లైంగికంగా వేధించాడా? అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, కీచక గురువు బాలచంద్ర భంగాలేపై ఐపీసీ 376, 377, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.