శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Modified: చెన్నై , శుక్రవారం, 30 జూన్ 2017 (23:49 IST)

అయ్యవారికీ పుట్టింది పాడుబుద్ధి.. బూతు చిత్రాలతో లైంగిక వేధింపులు

పిల్లలకు చదువు చెప్పాల్సిన టీచరే మద పిచ్చి పెరిగి వారికి సెల్‌ఫోన్లో బూతు బొమ్మలను చూపించి మరీ లైంగిక వేధింపులకు గురి చేస్తే ఆ పిల్లలు ఇక ఎవరిని నమ్మాలి? ఆ తల్లి దండ్రులు ఏ ధైర్యంతో తమ పిల్లలను బడికి పంపాలి? టీచర్ ఇలా చేస్తున్నాడని పిల్లలు చెప్పగానే

పిల్లలకు చదువు చెప్పాల్సిన టీచరే మద పిచ్చి పెరిగి వారికి సెల్‌ఫోన్లో బూతు బొమ్మలను చూపించి మరీ లైంగిక వేధింపులకు గురి చేస్తే ఆ పిల్లలు ఇక ఎవరిని నమ్మాలి? ఆ తల్లి దండ్రులు ఏ ధైర్యంతో తమ పిల్లలను బడికి పంపాలి? టీచర్ ఇలా చేస్తున్నాడని పిల్లలు చెప్పగానే కోపావేశంతో తల్లిదండ్రులు స్కూలుపై దాడి చేసి ఆ వెధవ టీచర్ని పట్టుకుని చితకబాది పోలీసులులకు అప్పగించితే సహజన్యాయం పేరిట సమర్థించవచ్చు. కాని ఎంత మంది పిల్లల్ని ఇక టీచర్ల వికృత చేష్ట్య నుంచి కాపాడతారు. ఒక సమాజ జ్ఞాన వికాస పరిణామానికి కారకులు కావలసిన టీచర్లలోనే ఇలాంటి కామ ప్రకోపాలు బయలు దేరుతుంటే పిల్లలు ఇక ఎవరిని నమ్మాలి? ఆ స్కూలు పిల్లలకు ఎవరు చదువు చెబుతారు?
 
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్ధినులకు సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలను చూపించి లైంగిక వేధింపులకు గురి చేసిన ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుపూర్ జిల్లా అవినాశి గురుపాలయం గ్రామ పంచాయితీ యూనియన్ బాలికల మాధ్యమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో 97 మంది విద్యార్ధిని, విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాలలో నీలగిరి జిల్లా కోత్తగిరి అట్టాపట్టు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి(42) 2016 ఆగస్టు నుంచి ఇక్కడ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.
 
ఇతను 8వ తరగతి విద్యార్థినులకు సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూపించి వారిని లైంగిక వేధింపులకు గురి చేసేవాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు దిగ్భ్రాంతి చెందారు. దీనిపై ఆగ్రహించిన బాలికల తల్లిదండ్రులు, ప్రజలు గురువారం పాఠశాలను ముట్టడించారు. 
 
బయటికి వచ్చిన కృష్ణమూర్తి చొక్కా పట్టుకుని అతనిపై  దాడి జరిపారు. అతనిపై చర్య తీసుకోవాలని రాస్తారోకోకు దిగారు. సమాచారం అందుకున్న సేవూరు పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఆ ఉపాధ్యాయుడిని  విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు జీపులో తీసుకెళ్లారు.
 
ఈ స్థితిలో విద్యార్థుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. దీంతో తిరుపూర్ జిల్లా సాంఘిక సంక్షేమ విభాగ అధికారి పూంగోదై, జిల్లా పిల్లల సంరక్షణాధికారి వసంత కుమార్ చైల్డ్ లైన్ సంస్థ కోఆర్డినేటర్ తదితరులు విద్యార్థినుల వద్ద ప్రత్యేకంగా విచారణ జరిపారు. కృష్ణమూర్తిపై లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.