శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 14 డిశెంబరు 2017 (09:42 IST)

క్లాస్ రూమ్‌లో ఇన్నర్‌వేర్‌తో పాఠాలు చెప్పిన షైమాకు రెండేళ్ల జైలు

ఈజిప్టు పాప్ సింగర్, హాట్ బ్యూటీ షైమా అహ్మద్‌కు కోర్టు రెండేళ్ల జైలు విధించింది. ఇంతకీ షైమా ఏం చేసిందంటే.. మ్యూజిక్ వీడియోను అసభ్యంగా రూపొందించింది. అంతేగాకుండా ఇన్నర్‌వేర్‌తో క్లాస్ రూమ్‌లో విద్యార్థ

ఈజిప్టు పాప్ సింగర్, హాట్ బ్యూటీ షైమా అహ్మద్‌కు కోర్టు రెండేళ్ల జైలు విధించింది. ఇంతకీ షైమా ఏం చేసిందంటే.. మ్యూజిక్ వీడియోను అసభ్యంగా రూపొందించింది. అంతేగాకుండా ఇన్నర్‌వేర్‌తో క్లాస్ రూమ్‌లో విద్యార్థులకు పాఠాలు చెప్పింది. అయితే తన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పినా.. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. 
 
షైమా రూపొందించిన వీడియోలో అత్యంత జుగుప్సాకరంగా నటించిందని షైమాపై కేసు నమోదైంది. ఈ వీడియోలో ఇన్నర్ వేర్ మాత్రమే ధరించిన షైమా తరగతి గదిలో అభ్యంతరకరంగా నిల్చుని విద్యార్థులకు పాఠాలు చెప్తూ కనిపించింది. 
 
ఇంకా ఓ అరటిపండును తింటు జుగుప్సాకరంగా నటించింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆమెపై ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆపై  షైమా క్షమాపణలు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు షైమా నటన హేయమని పేర్కొంటూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది.