గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 జులై 2017 (14:03 IST)

చిల్లీ చికెన్ తీసిస్తానని మోసం చేసి.. 12 ఏళ్ల బాలికను గర్భవతిని చేశాడు..

చిల్లీ చికెన్ తీసిస్తానని.. 12 ఏళ్ల బాలికను గర్భవతిని చేశాడు.. ఓ 55 ఏళ్ల ప్రబుద్ధుడు. తమిళనాడు కోవై జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 12 ఏళ్ల చిన్నారి 8వ తరగతి చదువుతోంది. చిన్నారిపై

చిల్లీ చికెన్ తీసిస్తానని.. 12 ఏళ్ల బాలికను గర్భవతిని చేశాడు.. ఓ 55 ఏళ్ల ప్రబుద్ధుడు. తమిళనాడు కోవై జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 12 ఏళ్ల చిన్నారి 8వ తరగతి చదువుతోంది. చిన్నారిపై పక్కింటికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి కన్నేశాడు. చిన్నారికి చిల్లి చికెన్ తీసిస్తానని నమ్మించి.. లోబరుచుకుని గర్భవతిని చేశాడు. వివరాల్లోకి వెళితే.. కోవై, పొల్లాచ్చి, నెగమం సమీపంలోని కార్మికుని కుమార్తె 12 ఏళ్ల బాలిక. 
 
ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఆరుస్వామి అనే 55 ఏళ్ల వ్యక్తి కన్నేశాడు. ఆతని భార్య ఇటీవల మరణించడంతో ఒంటరిగా వుంటున్నాడు. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం పక్కింటి చిన్నారికి చిల్లీ చికెన్ తీసిస్తానని ఇంటికి తీసుకొచ్చాడు. దీన్ని నమ్మిన చిన్నారి.. అతనింటికి వెళ్ళి అత్యాచారానికి గురైంది. ఈ విషయాన్ని బయటికి చెప్తే చంపేస్తానని బెదిరించాడు. 
 
దీంతో జడుసుకున్న చిన్నారి తల్లిదండ్రుల వద్ద కూడా ఈ విషయాన్ని దాచేసింది. కానీ కొన్ని రోజుల క్రితం చిన్నారి వేవిళ్లు చేసుకోవడం గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు ఆమె గర్భంగా ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో షాక్ తిన్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుస్వామిని అరెస్టు చేశారు.