సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : బుధవారం, 13 డిశెంబరు 2017 (11:42 IST)

కొబ్బరి నూనెతో నోటిని పుక్కిలిస్తే...

వంటల్లో కొద్దిగా కొబ్బరి నూనె వేస్తే ఆరోగ్యకరం. శరీరంలో ఉండే కొవ్వుని కొబ్బరి నూనె పూర్తిగా కరిగిస్తుంది. కొబ్బరి నూనె కుదరని పక్షంలో ఆలివ్ నూనె వాడుకోవచ్చు. లేకపోతే నువ్వులనూనె కూడా వంటల్లో వాడటం ద్వ

వంటల్లో కొద్దిగా కొబ్బరి నూనె వేస్తే ఆరోగ్యకరం. శరీరంలో ఉండే కొవ్వుని కొబ్బరి నూనె పూర్తిగా కరిగిస్తుంది. కొబ్బరి నూనె కుదరని పక్షంలో ఆలివ్ నూనె వాడుకోవచ్చు. లేకపోతే నువ్వులనూనె కూడా వంటల్లో వాడటం ద్వారా బరువును తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా కొబ్బరి నూనె బరువును బాగా తగ్గిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంపొందింపజేస్తుంది. 
 
కొబ్బరినూనె జీర్ణక్రియకు మేలు చేస్తుంది. మెదడు సంబంధిత రుగ్మతలను నయం చేస్తుంది. అల్జీమర్స్‌ను దరిచేరనివ్వదు. అలాగే ప్రపంచంలో ప్రధాన అనారోగ్య సమస్యగా మారిన ఒబిసిటీకి కొబ్బరి నూనె దివ్యౌషధంగా మారుస్తుంది. కొబ్బరినూనె కేలరీలను కరిగిస్తుంది. కొబ్బరినూనె ఆకలిని తగ్గిస్తుంది. కానీ హృద్రోగ వ్యాధుగ్రస్థులు కొబ్బరి నూనెను వాడకపోవడం మంచిది. 
 
కొబ్బరినూనెను వంటల్లో వాడటం ద్వారా కేశసంరక్షణకు తోడ్పడుతుంది. చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పొడిబారిన చర్మానికి తేమనిస్తుంది. కొబ్బరి నూనెతో నోటిని పుక్కిలిస్తే.. (ఆయిల్ పుల్లింగ్) అనారోగ్యాలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నోటి నుంచి తొలగించుకోవచ్చు. తద్వారా దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. నోటి దుర్వాసన కూడా తొలగిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.