శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 8 డిశెంబరు 2017 (21:53 IST)

బొప్పాయిలో వున్న ప్రయోజనాలు ఏమిటంటే...

బొప్పాయి పండు మన శరీరానికి చేసే మేలు అంతాఇంతా కాదు. పండు బొప్పాయితో పాటు పచ్చి బొప్పాయి కూడా మన శరీరానికి మేలు చేస్తుంది. పచ్చిబొప్పాయిలో ఔషధ తత్వాలు ఉన్నాయి. పచ్చిబొప్పాయిని తరచూ తింటే ఉదర సంబంధిత వ్యాధులు పోతాయి. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది బాగా ఉపయ

బొప్పాయి పండు మన శరీరానికి చేసే మేలు అంతాఇంతా కాదు. పండు బొప్పాయితో పాటు పచ్చి బొప్పాయి కూడా మన శరీరానికి మేలు చేస్తుంది. పచ్చిబొప్పాయిలో ఔషధ తత్వాలు ఉన్నాయి. పచ్చిబొప్పాయిని తరచూ తింటే ఉదర సంబంధిత వ్యాధులు పోతాయి. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. పచ్చి బొప్పాయిని తినడం వల్ల రక్తంలో షుగర్ శాతాన్ని తగ్గిస్తుంది. తరచూ బొప్పాయిని తింటే విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, మెగ్నీషియం, పొటాషియం ఉండడం వల్ల మన శరీరంలో గాయాలు ఉంటే వెంటనే మానిపోతాయి. 
 
మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంటుంది. పండిన బొప్పాయి కన్నా పచ్చిబొప్పాయిలో ఎక్కువ యాక్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. పొపైన్, చైమో పొపైన్ లు మన శరీరంలోని అధిక కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలంటే పచ్చి బొప్పాయి తినడం చాలా మంచిది. అజీర్తితో బాధపడేవారికి ఇది ఔషధం. 
 
మలబద్థక సమస్యను కూడా తగ్గిస్తుంది. పొట్టను క్లీన్ చేయడానికి దోహదం చేస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది. కంటి సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. విటమిన్ల లోపం రాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రసవం అయిన తరువాత బొప్పాయి కూరను లేదా తినడం చేస్తుంటారు.