శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 జనవరి 2018 (15:49 IST)

వర్మ సినిమాలో నాగార్జున సిక్స్ ప్యాక్ లుక్ అదుర్స్!

టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున, సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌ రెండున్నర దశాబ్దాల తర్వాత రిపీట్ కానుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన "శివ" చిత్రం సంచలన విజయం నమోదుచేసుకున్న విషయ

టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున, సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌ రెండున్నర దశాబ్దాల తర్వాత రిపీట్ కానుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన "శివ" చిత్రం సంచలన విజయం నమోదుచేసుకున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం రానుంది. 
 
పోలీస్ డ్రామాగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం గత యేడాది న‌వంబర్ 20వ తేదీన పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఇటీవ‌లే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్‌కి కూడా సిద్ధ‌మైంది. ఇందులో క‌థానాయిక‌గా అనుష్క‌, ట‌బు అని ప‌లు పేర్లు వినిపించిన‌, చివ‌రికి మైరా సరీన్ అనే కొత్త అమ్మాయిని దర్శకుడు వర్మ ఎంచుకున్నారు. 
 
ఇక ఈ సినిమాపై అంద‌రిలోను ఎంతో ఉత్కంఠ నెల‌కొన‌గా, మూవీకి ఎలాంటి టైటిల్ పెడ‌తాడు, నాగ్ లుక్ ఎలా ఉంటుంది అనే దానిపై అభిమానులు ప‌లు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే చిత్రానికి "గ‌న్" అనే టైటిల్ ఫిక్స్ చేస్తాడ‌ని అంద‌రు భావిస్తున్నారు. ఇక నాగ్ లుక్ విష‌యానికి వ‌స్తే తాజాగా కింగ్ నాగ్ సిక్స్ ప్యాక్‌తో ఉన్న ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతుంది. ఇది వ‌ర్మ సినిమాకి సంబంధించిన లుక్ అని కొంద‌రు అంటుండ‌గా, మ‌రి కొంద‌రు మార్ఫింగ్ అంటున్నారు. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.