మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Modified: శనివారం, 4 ఆగస్టు 2018 (15:27 IST)

హెల్మెట్ ధరించలేదేంటి అన్నందుకు పోలీసులను బూతులు తిట్టిన మహిళ

హైదరాబాద్ ఆబిడ్స్ ట్రాఫిక్ పోలీసులకు పట్టపగలు చుక్కలు చూపించింది ఓ మహిళ. హెల్మెట్ లేకుండా టూవీలర్ పైన ప్రయాణిస్తున్న ఓ మహిళను హెడ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయం వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఆపి హెల్మెట్ లేకుండా వెళుతున్నారేంటి అంటూ, వాహనాన

హైదరాబాద్ ఆబిడ్స్ ట్రాఫిక్ పోలీసులకు పట్టపగలు చుక్కలు చూపించింది ఓ మహిళ. హెల్మెట్ లేకుండా టూవీలర్ పైన ప్రయాణిస్తున్న ఓ మహిళను హెడ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయం వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఆపి హెల్మెట్ లేకుండా వెళుతున్నారేంటి అంటూ, వాహనానికి సంబంధించిన పత్రాలను చూపించమని అడిగారు.
 
దీంతో సదరు మహిళ పోలీసులపై బూతు పురాణం మొదలు పెట్టింది. అసభ్యకర పదజాలంతో దూషిస్తూ పోలీసులపై చిందులేసింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు గత్యంతరంలేక మహిళను అదుపు చేసేందుకు లాండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అది గమనించిన మహిళ ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బండికి తాళం వేసి అక్కడి నుండి మెల్లగా జారుకుంది. ట్రాఫిక్ పోలీసులు వాహనం స్వాధీనం చేసుకొని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.