1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Woman brutal murder In Warangal

అక్రమ సంబంధాన్ని నిలదీసిందనీ... భర్త ఏం పని చేశాడో తెలుసా?

పరాయి మహిళతో గుట్టుచప్పుడుకాకుండా సాగిస్తున్న అక్రమ సంబంధాన్ని భార్య నిలదీసింది. దీంతో ఒక్కసారిగా ఆగ్రహోద్రుక్తుడైన భర్త... కట్టుకున్న భార్యను చెట్టుకు కట్టేసి చితకబాది ఆ తర్వాత నిప్పుపెట్టాడు. ఈ దారు

Warangal
పరాయి మహిళతో గుట్టుచప్పుడుకాకుండా సాగిస్తున్న అక్రమ సంబంధాన్ని భార్య నిలదీసింది. దీంతో ఒక్కసారిగా ఆగ్రహోద్రుక్తుడైన భర్త... కట్టుకున్న భార్యను చెట్టుకు కట్టేసి చితకబాది ఆ తర్వాత నిప్పుపెట్టాడు. ఈ దారుణం వరంగల్ జిల్లాలో పర్వతగిరి మండలంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం తూర్పుతండాకు చెందిన రజిత అనే మహిళ తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసి నిలదీసింది. ఆ తర్వాత భర్తపై నిఘా పెట్టింది. ఈ క్రమంలో పరాయి మహిళతో భర్త ఏకాంతంగా ఉన్నపుడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. 
 
అంతే.. ఒక్కసారిగా ఆగ్రహానికిలోనైన భర్త.. రజితను చెట్టుకు కట్టేసి నిప్పంటించాడు. మం‍టల్లో కాలి తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
బీజేపీ షాక్.. జగన్ పార్టీలో చేరనున్న మాజీ సీఎం కుమారుడు?