శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Modified: గురువారం, 2 ఆగస్టు 2018 (15:09 IST)

శంషాబాద్ విమానంలో మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జెజిరా ఎయిర్‌లైన్స్‌‌కు పెను ప్రమాదం తప్పింది. కువైట్ నుంచి వచ్చిన విమానం ల్యాండ్ అవుతుండగా కుడివైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో పైలట్ రన్‌వేపైనే విమానాన్ని నిలిపివేశాడు. సకాలంలో ఫైరింజన్లు విమానం దగ్గరకు చేరుకుని మంటలను ఆర్పివ

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జెజిరా ఎయిర్‌లైన్స్‌‌కు పెను ప్రమాదం తప్పింది. కువైట్ నుంచి వచ్చిన విమానం ల్యాండ్ అవుతుండగా కుడివైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో పైలట్ రన్‌వేపైనే విమానాన్ని నిలిపివేశాడు. సకాలంలో ఫైరింజన్లు విమానం దగ్గరకు చేరుకుని మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. 
 
ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రధాన రన్‌వేపై విమానం నిలిచిపోవడంతో పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. విమానంలో దాదాపు 130 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.