ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 22 జులై 2018 (13:53 IST)

ఆరెంజ్ ట్రావెల్స్.. బస్సు అదుపు తప్పి.. పంట కాల్వలో బోల్తా.. ఎలా జరిగింది?

ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది. పంట కాల్వలో బస్తు బోల్తా పడింది. ఈ ఘటన కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం వానపాముల వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురికి స్వల్ప గాయాలయాయి.

ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది. పంట కాల్వలో బస్తు బోల్తా పడింది. ఈ ఘటన కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం వానపాముల వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురికి స్వల్ప గాయాలయాయి. 
 
క్షతగాత్రులను గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుండి 40 మంది ప్రయాణికులతో నర్సాపురం వెళ్తున్న ట్రావెల్ బస్సు.. వానపాముల వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పంట బోదెలో బోల్తా పడింది. 
 
ఈ ఘటనతో ప్రయాణికులందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఎవరికి వారే బస్సు అద్దాలు పగుల కొట్టి బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. డ్రెవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.