1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. If you are suffering from this dyspepsia? use this tips?

అజీర్తితో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటిస్తే?

కొన్ని ఆహార పదార్ధాలు ఎక్కువగా తినడం వలన అజీర్తి కలుగుతుంది. అటువంటపుడు దానికి విరుగుడుగా కొన్ని పదార్ధాలను తీసుకోవడం అజీర్తి నుండి ఉపశమనం పొందవచ్చును. మాంసాహారం ఎక్కువగా తీసుకున్నప్పుడు కలిగే అజీర్తి

dyspepsia
కొన్ని ఆహార పదార్ధాలు ఎక్కువగా తినడం వలన అజీర్తి కలుగుతుంది. అటువంటపుడు దానికి విరుగుడుగా కొన్ని పదార్ధాలను తీసుకోవడం అజీర్తి నుండి ఉపశమనం పొందవచ్చును. మాంసాహారం ఎక్కువగా తీసుకున్నప్పుడు కలిగే అజీర్తికి విరుగుడుగా కాంజికం త్రాగాలి. కాంజికం అంటే అన్నాన్ని పులిసేవరకూ నీళ్ళలో నానబెట్టి పిండి వడగట్టగా వచ్చిన దాన్ని కాంజికం అంటారు.
 
చేపలు ఎక్కువగా తిన్నప్పుడు కలిగే అజీర్తికి మూడుపూటల ఒక్కో గ్లాసు మజ్జిగ త్రాగితే మంచిది. నేతితో తయారుచేసిన పదార్ధాలను ఎక్కువగా తీసుకోవడం వలన కలిగే అజీర్తిలో దప్పిక అధికంగా ఉంటుంది. కడుపులో వికారంగా ఉంటుంది. అలావున్నప్పుడు నిమ్మరసాన్ని మజ్జిగలో కలిపి కొంచెం ఉప్పు వేసుకుని తీసుకుంటే వికారం నుండి విముక్తి చెందవచ్చును.
 
నిమ్మ, నారింజ, ద్రాక్షాల వంటి పుల్లటి పదార్ధాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు కలగే అజీర్తికి కొద్దిగా బెల్లం తీసుకుంటే చాలు. ఉలవచారు, ఉలవలు, గుగ్గిళ్ళు ఎక్కువగా తీసుకున్నప్పుడు కలిగే అజీర్తికి నెయ్యిగాని, వెన్నగాని తీసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. రాత్రులు చపాతీలు ఎక్కువగా తీసుకోవడం వలన కలిగే అజీర్తికి దోసకాయ కూరను తీసుకుంటే అజీర్తి కలగదు.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
ఇంట్లో దుర్వాసనను తట్టుకోలేకపోతున్నారా...?