మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 10 జులై 2018 (19:37 IST)

బంగాళాదుంప ముక్కలు కళ్ల మీద పెట్టుకుంటే?

బంగాళాదుంపల్ని మెత్తగా చేసి దాని రసాన్ని తీసుకోవాలి. దాంతో తరచూ ముఖం కడుక్కుంటే కళతప్పి నిర్జీవంగా మారిన చర్మం మెరిసిపోతుంది. వీలైతే ప్రతిరోజూ చేసినా కూడా మంచిది. చర్మం కమిలిపోయిన చోట దీనిని రాసుకుంటే

బంగాళాదుంపల్ని మెత్తగా చేసి దాని రసాన్ని తీసుకోవాలి. దాంతో తరచూ ముఖం కడుక్కుంటే కళతప్పి నిర్జీవంగా మారిన చర్మం మెరిసిపోతుంది. వీలైతే ప్రతిరోజూ చేసినా కూడా మంచిది. చర్మం కమిలిపోయిన చోట దీనిని రాసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. రెండు చెంచాల బంగాళాదుంప రసంలో చెంచా నిమ్మరసం కలుపుకోవాలి.
 
ఈ మిశ్రమాన్ని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. బయటకు తీశాక దూదితో ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వలన మృతుకణాలు తొలగిపోయి చర్మం శుభ్రపడుతుంది. మెుటిమలు, మచ్చలు ఏర్పడడం వంటి సమస్యలు దూరమవుతాయి.
 
ముల్తానీ మట్టిలో చెంచా బంగాళాదుంప గుజ్జ, నాలుగు చుక్కల రోజ్‌వాటర్ కలిపి ముఖానికి పూతలా రాసుకోవాలి. పావుగంట తరువాత చల్లటి నీటితో శుభ్రపరచుకోవాలి.  బంగాళాదుంపను ఉడికించి మెత్తగా చేసుకోవాలి. అందులో కొంచెం పాలపొడి, బాదం నూనె చేర్చి ముఖానికి మర్దన చేసుకోవాలి. 
 
తరచుగా ఇలా చేయడం వలన పొడిబారిన చర్మానికి తేమ అందుతుంది. కళ్ల కింద నల్లమచ్చలు ఇబ్బంది పెడుతుంటే బంగాళాదుంప ముక్కలు తరిగి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. కాసేపటి తరువాత కొన్ని నిమిషాల పాటు కళ్ల మీద పెట్టుకోవాలి. ప్రతిరోజు ఇలా చేస్తుంటే క్రమంగా నల్లటిమచ్చలు తగ్గుముఖం పడుతాయి.