1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. organge skin beauty tips

నారింజ తొక్కల పొడిని ముఖానికి రాసుకుంటే?

చెంచా వెనిగర్‌లో మూడు చెంచాల నీళ్లను కలుపుకుని దూదిని అందులో ముంచి ముఖానికి రాసి 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటిలో శుభ్రం చేసుకోవాలి. దాల్చిన చెక్కలో ఉంజే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెుటిమలకు కారణమ

orange
చెంచా వెనిగర్‌లో మూడు చెంచాల నీళ్లను కలుపుకుని దూదిని అందులో ముంచి ముఖానికి రాసి 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటిలో శుభ్రం చేసుకోవాలి. దాల్చిన చెక్కలో ఉంజే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెుటిమలకు కారణమైన బ్యాక్టీరియాలను చంపేస్తాయి. రెండు చెంచాల తేనె, చెంచా దాల్చిన చెక్కపొడి కలుపుకోవాలి.
 
ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి పావుగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. తేనెలో పాలు కలిపి ముఖానికి పట్టించి పావుగంట తరువాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. బొప్పాయి జిడ్డుని తొలగించి మెుటిమలు రాకుండా అడ్డుకుంటుంది.
 
దీనికోసం బాగా పండిన బొప్పాయి గుజ్జును ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. రెండు చెంచాల నారింజ తొక్కల పొడికి తగినన్ని నీళ్లు చేర్చి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వలన మెుటిమలు తొలగిపోయి ముఖం అందంగా, కాంతివంతంగా మారుతుంది. 
 
అరటిపండు తొక్కని ముఖంపై వలయాకారంగా 15 నిమిషాల పాటు రుద్దుకోవాలి. అరగంట తరువాత నీళ్లతో శుభ్రం చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. పచ్చి బంగాళాదుంపని ముక్కలుగా కోసి ఆ ముక్కతో ముఖంపై మలయాకారంగా 10 నిమిషాల పాటు రుద్దాలి. ఆరాక వెచ్చని నీళ్లతో కడిగేస్తే మెుటిమలు తగ్గుముఖం పడుతాయి.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
ఉసిరి జ్యూస్‍‌తో ఎంతో మేలు.. ఎలా చేయాలో వీడియోలో చూడండి..