1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Boat accident in East Godavari, 4 persons missing

తూ.గో జిల్లాలో పడవ ప్రమాదం... నలుగురు గల్లంతు

తూర్పు గోదావరి జిల్లాలో పడవ ప్రమాదం జరిగింది. ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద మర పడవ అదుపుతప్పి బోల్తాపడింది. పశువులంక మెండి నుంచి సలాదివారిపాలెం గ్రామానికి సుమారు 30 మందితో బయల్దేరిన ఈ మర పడవ మొండిల్లంక రేవు వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్‌కు తగలడ

Boat accident
తూర్పు గోదావరి జిల్లాలో పడవ ప్రమాదం జరిగింది. ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద మర పడవ అదుపుతప్పి బోల్తాపడింది. పశువులంక మెండి నుంచి సలాదివారిపాలెం గ్రామానికి సుమారు 30 మందితో బయల్దేరిన ఈ మర పడవ మొండిల్లంక రేవు వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్‌కు తగలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. 
 
పడవ ప్రారంభమైన వెంటనే డ్రైవర్ పడవ ఇంజన్ వేయడం జరిగింది. అయితే వరద కారణంగా పెద్ద ఎత్తున చేరిన చెత్త, ఇంజన్ పంకాకు అడ్డు తగలడంతో ఇంజన్ మోరాయించింది.. గోదావరి నది ప్రవాహం ఎక్కువుగా ఉండటం గాలి కూడా వీయడంతో పడవ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి వంతెన పిల్లర్‌కు తగిలిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రయాణికుల్లో  విద్యార్థులు కూడా ఉన్నారు. 
 
విద్యార్థులంతా పదో తరగతి లోపువారేనని తెలుస్తోంది. ఇప్పటికే 26 మందిని గ్రామస్తులు కాపాడారు. గల్లంతైన నలుగురి వివరాలింకా తెలియరాలేదు. అప్రమత్తమైన కొందరు విద్యార్థులు అందుబాటులో ఉన్న పిల్లరు ఎక్కి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఇంకొందరిని మత్స్యకారులు, స్థానికులు కాపాడారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. 
ఈ దుర్ఘటనపై  ఏపీ ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే సమాచారం తెప్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
తర్వాతి కథనం
సుఖం కోసం వేశ్యాగృహానికి వెళితే అమ్మాయి చెప్పింది విని కన్నీరు పెట్టుకున్నాడు?