శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: మంగళవారం, 15 మే 2018 (21:01 IST)

గోదావరిలో ఘోర ప్రమాదం... మునిగిపోయిన పడవ

తూర్పు గోదావరి జిల్లాలో కొండమొదలు నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న లాంఛీ మంటూరు దగ్గర గోదావరిలో మునిగిపోయింది. ఈ లాంఛీలో పెళ్లి బృందంతో పాటు మరో 30 మంది ఉన్నట్టు సమాచారం. పడవ మునిగాక కొంతమంది ప్రయాణికులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. నాటు పడవలో ప్రమాద

తూర్పు గోదావరి జిల్లాలో కొండమొదలు నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న లాంఛీ మంటూరు దగ్గర గోదావరిలో మునిగిపోయింది. ఈ లాంఛీలో పెళ్లి బృందంతో పాటు మరో 30 మంది ఉన్నట్టు సమాచారం. పడవ మునిగాక కొంతమంది ప్రయాణికులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. నాటు పడవలో ప్రమాద స్థలికి వెళ్లి గిరిజనులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
 
గోదావ‌రిలో లాంచీ మున‌క ప్ర‌మాదంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరా తీశారు. యుద్ధ ప్రాతిప‌దిక‌న స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. జిల్లా అధికారుల‌తో మాట్లాడి ప్ర‌మాద వివ‌రాల‌ను తెలుసుకున్నారు. బాధితుల‌కు ప్ర‌భుత్వం నుంచి పూర్తి స‌హాయం అంద‌జేయాల‌ని ఆదేశాలిచ్చారు.