ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 16 మే 2018 (18:31 IST)

లాంచీ బాధిత కుటుంబాలను ఆదుకోండి... ప్రభుత్వ ఉద్యోగమివ్వండి...

అమరావతి : గోదావరి నదిలో లాంచీ బోల్తా ఘటనలో గల్లంతయిన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని ఏపీ సెక్రటేరియట్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం కోరింది. ఈ మేరకు ఆ సంఘ సభ్యులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గోదావరిలో లాంచీ బోల్తా ఘటనలో 40 మంది గల్లంతయ్యార

అమరావతి :  గోదావరి నదిలో లాంచీ బోల్తా ఘటనలో గల్లంతయిన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని ఏపీ సెక్రటేరియట్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం కోరింది. ఈ మేరకు ఆ సంఘ సభ్యులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గోదావరిలో లాంచీ బోల్తా ఘటనలో 40 మంది గల్లంతయ్యారన్నారు. వారంతా నిరుపేద గిరిజన కుటుంబాలకే చెందినవారని, బాధిత కుటుంబాలకు తమ సంస్థ ప్రగాడ సానుభూతి తెలియజేస్తోందని అన్నారు. 
 
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి సహాయక చర్యలకు ఆదేశించడమే కాకుండా స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించడం అభినందనీయమన్నారు. గల్లంతయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు అర్హులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని సెక్రటేరియట్ ఎస్.సి., ఎస్.టి., ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బొంజుబాబు, ఉపాధ్యక్షులు శ్యామసుందర్ రావు, రమేష్, కార్యదర్శి నీలమయ్య కోరారు.