శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (10:16 IST)

నన్ను కూడ రేప్ చేసి చంపేస్తారు... అసిఫా బాను న్యాయవాది

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కథువా జిల్లాలో జరిగిన అసిఫా బాను అత్యాచారం, ఆపై హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును విచారిస్తున్న న్యాయవాది దీపికా సింగ్ రాజావత్ ప్రాణభయంతో వణికిపోతోంది.

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కథువా జిల్లాలో జరిగిన అసిఫా బాను అత్యాచారం, ఆపై హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును విచారిస్తున్న న్యాయవాది దీపికా సింగ్ రాజావత్ ప్రాణభయంతో వణికిపోతోంది. తనను కూడా రేప్ చేసి చంపేస్తారంటూ వాపోతోంది.
 
దీనిపై ఆమె స్పందిస్తూ, 'నాపై హిందూ వ్యతిరేకిగా ముద్ర వేశారు. సామాజిక బహిష్కరణ విధించారు. వాళ్లు నన్ను రేప్‌ చేస్తారు. నన్ను చంపేస్తారు. బహుశా ఇక నన్ను కోర్టులో ప్రాక్టీసు చేయనివ్వరేమో. ఇక నేనెలా బతకాలో నాకు అర్థం కావట్లేదు' అంటూ వాపోయింది. 
 
ఆసిఫా కేసును వాదిస్తున్నందుకు తనపై కక్ష కట్టారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఇక, తమ భద్రతపైనే ఆందోళన పెరుగుతోందని, అందుకే, తాను సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని, తనకు, తన కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలని కోరతానని చెప్పారు. కాగా, ఎనిమిదేళ్ళ అసిఫా బానును కొందరు కామమాంధులు కిడ్నాప్ చేసి ఐదు రోజుల పాటు బంధించి అత్యాచారం చేసి, ఆపై చంపేసిన విషయం తెల్సిందే.