శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : సోమవారం, 16 ఏప్రియల్ 2018 (08:10 IST)

పవన్‌కు ప్యాకేజీ ఇస్తే చాలు.. మసాజ్ చేసేందుకు బెంగాలీ అమ్మాయిలు కావాలి..

టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌ పెను సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శనపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆమె ఎంచుకున్న విధానం సరిగ్గా లేదని కామెంట్ చేశారు. పవన్ కామెంట్స్‌పై శ్రీ

టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌ పెను సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శనపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆమె ఎంచుకున్న విధానం సరిగ్గా లేదని కామెంట్ చేశారు. పవన్ కామెంట్స్‌పై శ్రీరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు కౌంటర్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం సినీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ శ్రుతి కూడా పవన్‌పై మండిపడింది. తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక, ఆర్థిక దోపిడి అనే అంశంపై హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బహిరంగ చర్చ నిర్వహించారు.
 
ఈ కార్యక్రమంలో సినీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ శ్రుతి మాట్లాడుతూ.. పవన్‌కు ప్యాకేజీ ఇస్తే మాత్రం చాలునని ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం అమరావతిలో 200 కోట్ల రూపాయలతో ఇల్లు కడుతున్నాడని చెప్పారు. అంతేగాకుండా మసాజ్ చేసేందుకు బెంగాలీ అమ్మాయిలు కావాలని.. మహిళా సమస్యలు పరిష్కరించాలని వెళ్తే మాత్రం తమను పట్టించుకోలేదని విమర్శించారు. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులను సాక్ష్యాలతో సహా బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.