బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 15 ఏప్రియల్ 2018 (18:05 IST)

సిరియా సంక్షోభం: మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం కండి: రష్యా మీడియా

సిరియా సంక్షోభం మూడో ప్రపంచ యుద్ధానికి కేంద్ర బిందువు అయ్యే అవకాశం ఉంది. మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధంగా వుండండంటూ.. ఆ దేశ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది..రష్యా ప్రభుత్వ మీడియా సంస్థ. ప్రజలు తమను తామ

సిరియా సంక్షోభం మూడో ప్రపంచ యుద్ధానికి కేంద్ర బిందువు అయ్యే అవకాశం ఉంది. మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధంగా వుండండంటూ.. ఆ దేశ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది..రష్యా ప్రభుత్వ మీడియా సంస్థ. ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని ఆ దేశ మీడియా సూచించింది. ఈ మేరకు కొన్ని ముందస్తు సూచనలు కూడా ఇచ్చింది. 
 
బాంబు షెల్టర్లో వున్న ఐయోడిన్ ప్యాకెట్లను దగ్గర వుంచుకుని రేడియేషన్‌కు గురికాకుండా శరీరానికి రాసుకోవాలని.. ఆహార పదార్థాలను కూడా దాచిపెట్టుకోవాలని అందులో ఎక్కువ మొత్తం నీరు ఉండేలా చూసుకోవాలని వెల్లడించింది. సిరియా అంతర్యుద్ధంలో భాగంగా ప్రపంచం రెండో క్షిపణులు క్రైసిస్‌ను ఎదుర్కొంటుందని రష్యా దేశ రక్షణ నిపుణులొకరు తెలిపారు. తొలి కోల్డ్‌ వార్‌ కంటే ఈ వార్‌ అత్యంత ప్రమాదకరంగా ఉండబోతోందని హెచ్చరించారు.
 
ఏడు సంవత్సరాలుగా సిరియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధం మూడో ప్రపంచ యుద్ధంగా మారనుందని రష్యా మీడియా హెచ్చరించింది. సిరియాపై అమెరికా అణు దాడి జరిపేందుకు సిద్ధంగా ఉందని, అణ్వస్త్రాలను అమెరికా సిద్ధం చేసిందని అభిప్రాయపడింది. సిరియాలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ జరుపుతున్న యుద్ధాన్ని ఖండిస్తూ, రష్యా చేసిన తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ తిరస్కరించిన నేపథ్యంలో మీడియా సంస్థలు వరల్డ్ వార్ హెచ్చరికలు జారీ చేశాయి.