బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 16 మార్చి 2018 (18:23 IST)

''ఆచారి అమెరికా యాత్ర'' ఏప్రిల్ 5 నుంచి ప్రారంభం..

విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ''ఆచారి అమెరికా యాత్ర''. ఈ సినిమాకు జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ ప్రధానంగా తెరకెక్కే ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్

విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ''ఆచారి అమెరికా యాత్ర''. ఈ సినిమాకు జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ ప్రధానంగా తెరకెక్కే ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం విడుదలకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ ఐదో తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. 
 
ఖైదీ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో హాస్యం పండించిన బ్రహ్మానందం.. తాజాగా ఆచారి అమెరికా యాత్రలో కడుపుబ్బా నవ్విస్తారని సినీ యూనిట్ అంటోంది. కాగా ఇప్పటికే జి.నాగేశ్వర్ రెడ్డితో మంచు విష్ణు నటించిన దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం చిత్రాలు సక్సెస్ కావడంతో ఆచారి అమెరికా యాత్ర సినిమాపై అంచనాలు పెరిగాయి.