శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2018 (19:38 IST)

ఒక నువ్వు ఒక నేను పాట.. విష్ణు.. శ్రియ నటన అదుర్స్ (వీడియో)

''గాయత్రి'' సినిమా ఆడియో ఫంక్షన్‌లో హీరోయిన్ శ్రియ గురించి విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె నటన గురించి రెండు గంటలు చెప్పినా సరిపోదన్నారు. తాజాగా గాయత్రిలోని ఒక నువ్వు ఒక నేను ప

''గాయత్రి'' సినిమా ఆడియో ఫంక్షన్‌లో హీరోయిన్ శ్రియ గురించి విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె నటన గురించి రెండు గంటలు చెప్పినా సరిపోదన్నారు. తాజాగా గాయత్రిలోని ఒక నువ్వు ఒక నేను పాట విడుదలైంది. ఈ పాటలో విష్ణు, శ్రియ నటన అద్భుతంగా వుందని సినీ పండితులు చెప్తున్నారు. 
 
మోహ‌న్ బాబు, మంచు విష్ణు, శ్రియ‌, అన‌సూయ‌, నిఖిలా విమ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన గాయత్రి సినిమాకు మదన్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 9వ తేదీన ఈ సినిమా తెరపైకి రానుంది. ఈ చిత్రంలో త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో రూపొందిన ''ఒక నువ్వు ఒక నేను'' వీడియో సాంగ్ యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. 
 
ఈ పాటలో విష్ణు, శ్రియ భార్యాభ‌ర్త‌ల అనుబంధాన్ని చ‌క్క‌గా చూపెట్టారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్, జుబిన్, శ్రేయా గోషల్ ఈ పాటను పాడారు. ఇక ఈ సినిమాకు కథ, డైలాగ్స్.. డైమండ్ రత్నబాబు అందించారు.