శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శనివారం, 14 ఏప్రియల్ 2018 (14:41 IST)

సెన్సేషన్ కోసం కాదు.. న్యాయం కోసం పోరాడాలి : శ్రీరెడ్డి వ్యవహారంపై పవన్ కామెంట్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై ఒంటరిపోరాటం చేసిన నటి శ్రీరెడ్డి. తన పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ప్రవర్తించిన తీరుకు నిరసనగా ఆమె ఇటీవల అర్థనగ్న ప్రదర్శనకు దిగారు. ఇది దేశవ్యాప్తం

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై ఒంటరిపోరాటం చేసిన నటి శ్రీరెడ్డి. తన పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ప్రవర్తించిన తీరుకు నిరసనగా ఆమె ఇటీవల అర్థనగ్న ప్రదర్శనకు దిగారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ తర్వాత తన విషయంలో హీరో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలంటూ శ్రీరెడ్డి మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడా స్పందించలేదు.
 
ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కథువాలో ఎనిమదేళ్ళ బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసిన పాశవిక చర్యకు నిరసనగా శనివారం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో పలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్న జరిగింది. ఈ ధర్నాలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీరెడ్డి వ్యవహారంపై స్పందించారు. 
 
ఇండస్ట్రీలో ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని, కోర్టుకు వెళ్లాలని... అప్పుడే వారికి పూర్తి న్యాయం జరుగుతుందన్నారు. అన్యాయానికి గురైనవారికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. టీవీలలో చర్చల వల్ల ఏమీ రాదని... కొన్ని రోజుల తర్వాత అందరూ మరిచి పోతారని, న్యాయం కూడా జరిగే అవకాశం ఉండకపోవచ్చన్నారు. పైగా, సెన్సేషన్ కోసం కాకుండా, న్యాయం కోసం నిజాయితీగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.